ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను నాలుగో తరగతి వరకు  చదివిన స్కూల్‌కు గుర్తింపు లేదు.  టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసేటప్పుడు స్థానికత కోసం ఏం చేయాలి?

Published : 05 Jun 2022 23:14 IST

నేను నాలుగో తరగతి వరకు  చదివిన స్కూల్‌కు గుర్తింపు లేదు.  టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసేటప్పుడు స్థానికత కోసం ఏం చేయాలి?

- ఒక అభ్యర్థి

 ముందుగా ఓటీఆర్‌లో నాలుగో తరగతి వరకు ప్రైవేట్‌ అని నింపాలి. తర్వాత  స్థానికత కోసం సంబంధిత ప్రాంత తహసీల్దార్‌ నుంచి రెసిడెంట్‌ సర్టిఫికెట్‌ తీసుకుని అవసరమైన సందర్భంలో సమర్పించాల్సి ఉంటుంది.


ఎస్‌ఐ పోస్టులకు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అయితే నా ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు జులైలో ముగుస్తాయి. నాకు పరీక్ష రాయడానికి అర్హత ఉందా? 

-అనుముల

మీకు అర్హత లేదు. ఎందుకంటే జులై ఒకటి నాటికి మీ వద్ద డిగ్రీపాసైన సర్టిఫికెట్‌ ఉండాలి. ప్రస్తుత నోటిఫికేషన్‌ దరఖాస్తు తేదీలు కూడా ముగిశాయి.


నేను రెండు, మూడు తరగతులు సూర్యాపేట జిల్లాలో; నాలుగు నుంచి ఏడో తరగతి వరకు రంగారెడ్డి జిల్లాలో చదివాను. అయిదో తరగతి రెండు సార్లు చదివాను. ఎనిమిదో తరగతి చదవకుండా నేరుగా తొమ్మిది, పదో తరగతి సూర్యాపేట జిల్లాలో చదివాను. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగ విషయంలో ఏమైనా సమస్య ఉందా? నేను ఏ జిల్లాలో స్థానికతను పొందుతాను?

- సందీప్‌

ప్రభుత్వ ఉద్యోగ విషయంలో ఎటువంటి సమస్యా ఉండదు. మీరు రంగారెడ్డి జిల్లాలో స్థానికతను పొందుతారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు