ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను రెండో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు జనగామలో; అయిదో తరగతి నుంచి పదో తరగతి వరకు ములుగులో చదివాను.

Published : 07 Jun 2022 01:27 IST

నేను రెండో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు జనగామలో; అయిదో తరగతి నుంచి పదో తరగతి వరకు ములుగులో చదివాను. ఒకవేళ గ్రూప్‌-1 పోస్టుకు ఎంపికైతే నాకు ఏ జిల్లాలో పోస్టింగ్‌ వస్తుంది?

- కవిత
జ:
గ్రూప్‌-1 పోస్టులు మల్టీజోనల్‌ కిందకు వస్తాయి. ఉద్యోగ శిక్షణ పూర్తయిన తర్వాత అవి రాష్ట్ర స్థాయి పోస్టులుగా మారతాయి. కాబట్టి మిమ్మల్ని రాష్ట్రంలో ఎక్కడైనా నియమించేందుకు అవకాశం ఉంది.


ఒకటి, రెండు తరగతుల బోనఫైడ్‌ సర్టిఫికెట్‌లు లేవు. ప్రస్తుతం ఆ స్కూల్‌ కూడా నడవడం లేదు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దరఖాస్తులో ప్రైవేట్‌ అని నింపాలా? వెరిఫికేషన్‌ సమయంలో బోనఫైడ్‌లకు బదులుగా ఏ    సర్టిఫికెట్స్‌ను చూపించాలో తెలియజేయగలరు? 

- విష్ణువర్ధన్‌

జ: బోనఫైడ్‌ సర్టిఫికెట్లు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకటి, రెండు తరగతులకు సంబంధించి ఓటీఆర్‌లో ప్రైవేట్‌ అని నింపండి. దీంతోపాటు ఆ సంవత్సరాలకు సంబంధించి తహసీల్దార్‌ సంతకం చేసిన రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ను సిద్ధం చేసుకోండి. వెరిఫికేషన్‌ సమయంలో బోనఫైడ్‌కు బదులు రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ను చూపించాలి.


నేను 7వ తరగతి వరకు చదివిన స్కూల్‌ రంగారెడ్డి జిల్లాలో ఉండేది. ప్రస్తుతం సంగారెడ్డికి మారింది. నేను ఇప్పుడు ఏ ప్రాంతంలో స్థానికతను పొందుతాను?

-ముదిరాజ్‌

జ: ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల మేరకు మీరు రంగారెడ్డి జిల్లాలో స్థానికతను పొందుతారు.


నేను 2020లో డిగ్రీ పూర్తిచేశాను. కానీ ఒరిజినల్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ తీసుకోలేదు. ఈ కారణంగా ఎస్‌ఐ ఉద్యోగానికి చేసుకున్న దరఖాస్తును ఏమైనా తిరస్కరిస్తారా?

- విజయ్‌ కుమార్‌

జ: ప్రస్తుతం ఎటువంటి సమస్యా లేదు. మీ దరఖాస్తును తిరస్కరించరు. అయితే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయానికి ఒరిజినల్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ కచ్చితంగా మీ దగ్గర ఉండాలి.


మీ సందేహాలను పోస్ట్‌ చేయడానికి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.

help@eenadupratibha.net


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని