ఎంబీఏకు తోడుగా ఏ కోర్సులు?

మా అబ్బాయి రెండేళ్ల కిందట రోహ్‌తక్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కోర్సు (బీబీఏ 3 మూడేళ్లు + ఎంబీఏ 2 ఏళ్లు)లో చేరాడు. ఇది చదువుతూ చేయాల్సిన ఇతర కోర్సులు, పెంచుకోవాల్సిన   ...

Published : 08 Jun 2022 00:31 IST

మా అబ్బాయి రెండేళ్ల కిందట రోహ్‌తక్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కోర్సు (బీబీఏ 3 మూడేళ్లు + ఎంబీఏ 2 ఏళ్లు)లో చేరాడు. ఇది చదువుతూ చేయాల్సిన ఇతర కోర్సులు, పెంచుకోవాల్సిన   నైపుణ్యాల గురించి తెలియజేయగలరు.

- పి.బాబుప్రసాద్‌


ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏలో బీబీఏ, ఎంబీఏలకు సంబంధించిన అన్ని సబ్జెక్టులూ చదువుతారు. విడివిడిగా చదివితే, ఎంబీఏ ప్రోగ్రామ్‌లో మొత్తం మేనేజ్‌మెంట్‌ కోర్సుని రెండు సంవత్సరాల్లో 30 నుంచి 40 కోర్సుల్లో, బీబీఏ ప్రోగ్రామ్‌ని మూడు సంవత్సరాల్లో 35 నుంచి 45 కోర్సుల్లో చదువుతారు. ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌లో 65- 85 కోర్సులు చదువుతారు. ఈ రెండు ప్రోగ్రాముల్లో చాలా కోర్సులు సారూప్యతతో ఉంటాయి కాబట్టి, మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ఇంకా ప్రత్యేకంగా మరే కోర్సులూ అవసరం లేదు. చాలామంది విద్యార్థులు ఐఐఎంల్లో ఈ ప్రోగ్రామ్‌ చదవడానికే సమయం సరిపోవట్లేదని ఫిర్యాదు చేస్తూ ఉంటారు. వీటితో పాటు ఇంకా ఎక్కువ కోర్సులు చదవాలని మీ అబ్బాయిని ఇబ్బంది పెట్టకండి. ఐఐఎం లో విషయ పరిజ్ఞానంతో పాటు, నైపుణ్యాలపైనా మెరుగైన శిక్షణ ఇస్తారు. ఒకవేళ అతనికి ఆసక్తి ఉంటే ఆర్‌ ప్రోగ్రామింగ్‌, పైతాన్‌, బిగ్‌ డేటా, డేటా సైన్స్‌ లాంటి వాటితో పాటు ఏదైనా విదేశీ భాష నేర్చుకోమని చెప్పండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని