ఐఈఎస్‌ అవ్వాలంటే..

ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌) చేసి ప్రాజెక్ట్‌ ట్రెయినీగా చేస్తున్నాను. ఉద్యోగం చేస్తూనే ఐఈఎస్‌ (ఈఎస్‌ఈ) రాయాలంటే ఎలా ముందడుగు వేయాలి?

Updated : 13 Jun 2022 01:09 IST

ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌) చేసి ప్రాజెక్ట్‌ ట్రెయినీగా చేస్తున్నాను. ఉద్యోగం చేస్తూనే ఐఈఎస్‌ (ఈఎస్‌ఈ) రాయాలంటే ఎలా ముందడుగు వేయాలి?

- బి. సతీశ్‌కుమార్‌

ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు టెక్నికల్‌ సబ్జెక్టులపై పట్టు ఉన్నప్పటికీ, జనరల్‌ స్టడీస్‌ విషయానికొస్తే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర పోటీ పరీక్షలతో పోలిస్తే, యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌లో ప్రశ్నల స్థాయి కొంత కఠినంగా ఉంటుంది. కానీ, కనీసం రెండు సంవత్సరాలపాటు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయితే ఉత్తీర్ణత కష్టమేమీ కాదు. చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ చదివే సమయంలో ఈఎస్‌ఈలోని చాలా టాపిక్స్‌పై పెద్దగా దృష్టి పెట్టరు. ప్రిలిమినరీలో సమయ నిర్వహణ చాలా ముఖ్యం. సిలబస్‌నూ, పాత ప్రశ్నపత్రాలనూ పరిశీలించి, మీ ప్రస్తుత విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసుకొని సన్నద్ధత మొదలుపెట్టండి. ఇక మెయిన్స్‌ ఇంజినీరింగ్‌లో రాసిన పరీక్షలకు పూర్తి విభిన్నం. ముఖ్యంగా ప్రశ్నలు కాంప్రహెన్షన్‌, అప్లికేషన్‌, అనాలిసిస్‌, సింథసిస్‌, ఎవాల్యుయేషన్‌లను పరీక్షించేవిధంగా ఉంటాయి. మీరు ఉద్యోగం చేస్తూనే ఈ పరీక్ష రాయాలనుకొంటున్నారు కాబట్టి, ఉద్యోగాన్నీ, ప్రిపరేషన్‌ సమయాన్నీ సమన్వయం చేసుకొనేలా ప్రణాళికను తయారు చేసుకోండి. వీలుంటే ఒక సంవత్సరం ఉద్యోగానికి సెలవు పెట్టండి. ప్రామాణిక పుస్తకాలనుంచి నోట్స్‌ రాసుకొని, కనీసం రోజుకు 10 గంటలు చదివితే ఐఈఎస్‌ సాధించాలనే మీ కలను సాకారం చేసుకోవచ్చు!

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని