ఎలా సన్నద్ధం కావాలి?

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాను. జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకు సాధించి.. ఎన్‌ఐటీ లేదా ఐఐటీలో సీటు సంపాదించాలనేది నా ధ్యేయం. ఎలా సన్నద్ధం కావాలో చెబుతారా?

Published : 15 Jun 2022 00:34 IST

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాను. జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకు సాధించి.. ఎన్‌ఐటీ లేదా ఐఐటీలో సీటు సంపాదించాలనేది నా ధ్యేయం. ఎలా సన్నద్ధం కావాలో చెబుతారా?

 - బాల యశశ్వి

* చాలామంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షల మాదిరిగానే జేఈఈకి కూడా సన్నద్ధమైతే సరిపోతుందనుకుంటారు. కానీ ఈ రెండు పరీక్షలు పూర్తిగా భిన్నమైనవి. జేఈఈ మెయిన్స్‌లో ఎక్కువగా అప్లికేషన్‌ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో, రుణాత్మక మార్కులతో ఉంటుంది. కాబట్టి ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంక్‌ సాధించాలంటే ముఖ్యంగా ప్రాథమికాంశాలపై మంచి పట్టుండాలి. ఇంటర్‌ పుస్తకాలు, జేఈఈ మెటీరియల్‌తోపాటు ఎన్‌సీఈఆర్‌టీ 11, 12వ తరగతి పుస్తకాలను చదివి వాటిపై అవగాహన ఏర్పరుచుకోవాలి. ఫార్ములాలను బట్టీపట్టడం కాకుండా, వాటి మూలాల్లోకి వెళ్లి పూర్తిగా నేర్చుకోవాలి. జేఈఈ పరీక్షలో విజయం సాధించాలంటే విషయ పరిజ్ఞానంతోపాటు లాజికల్‌ రీజనింగ్‌, ఎనలిటికల్‌ రీజనింగ్‌ కూడా చాలా అవసరం. అలాగే ప్రామాణిక పుస్తకాలతోపాటు, పాత ప్రశ్నపత్రాలను కూడా సమకూర్చుకుని సిలబస్‌, ప్రశ్నల సరళిపై  అవగాహన పెంచుకోవాలి. ప్రణాళికతోపాటు సమయ నిర్వహణ కూడా చాలా అవసరం. వీలున్నన్ని నమూనా పరీక్షలు రాసి మీ బలాలు, బలహీనతలను అంచనా వేసుకోవాలి. దానికి అనుగుణంగా మీ సన్నద్ధతా ప్రణాళికను మార్చుకోండి. ఇవేకాకుండా.. జేఈఈలో విజయం సాధించిన మీ సీనియర్ల సలహాలతో ఎన్‌ఐటీలాంటి ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్‌ సంపాదించాలనే మీ కలను సాకారం చేసుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని