ఈ పుస్తకాలు సరిపోతాయా?

గ్రూప్‌-4కు మాత్రమే ప్రిపేర్‌ అవుతున్నాను. దీని కోసం ఆరు నుంచి పదో తరగతి వరకు మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ పుస్తకాలు చదివితే సరిపోతుందా?

Published : 20 Jun 2022 00:19 IST

గ్రూప్‌-4కు మాత్రమే ప్రిపేర్‌ అవుతున్నాను. దీని కోసం ఆరు నుంచి పదో తరగతి వరకు మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ పుస్తకాలు చదివితే సరిపోతుందా?

- శ్రీకాంత్‌

పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేప్పుడు నిర్ధారిత సిలబస్‌ కంటే ఎక్కువే చదవాలి. సాధారణంగా ఉద్యోగ నోటిఫికేషన్‌లో ఇచ్చే సిలబస్‌ విశాల పరిధిలో ఉంటుంది. కొన్నిసార్లు పరీక్షలో ఇచ్చే ప్రశ్నలు సిలబస్‌ పరిధి దాటినట్లు అనిపించినా సాంకేతికంగా నిరూపించడం కష్టమే. పదోతరగతి పాఠ్య పుస్తకాలు చదివి అర్థం చేసుకోవాలంటే, అందుకు సంబంధించిన ప్రాథమిక విషయాలు దిగువ తరగతుల్లో ఉంటాయి కాబట్టి, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ పుస్తకాలు కూడా చదవండి. మీరు గ్రూప్‌-4 కు దరఖాస్తు చేసుకుంటే, ఆ సిలబస్‌ తోపాటు, అంతకంటే పై స్థాయి సిలబస్‌నూ చదవడం శ్రేయస్కరం. ఉదాహరణకు మెంటల్‌ ఎబిలిటీ సబ్జెక్ట్‌ సిలబస్‌లో డిగ్రీ, ఇంటర్‌, పదో తరగతి స్థాయిలో వివిధ రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కానీ పరీక్షలో ఇచ్చే ప్రశ్న ఏ స్థాయిలో ఉందో కచ్చితంగా నిర్థరించడం కొన్నిసార్లు కష్టమవుతుంది. ప్రాథమిక అంశాలపై గట్టి పట్టు, నిరంతర కృషి ఉంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం అంత కష్టమేమీ కాదు.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని