ఓబీసీ సర్టిఫికెట్‌ ఎలా?

గ్రాడ్యుయేషన్‌ చేసి గ్రూప్‌-1 ఉద్యోగానికి దరఖాస్తు చేశాను. నా సర్టిఫికెట్లన్నీ డాటరాఫ్‌ అంటూ నాన్న పేరుతో ఉన్నాయి. నాకు పెళ్లైనా కొన్ని కారణాల వల్ల వేర్వేరుగా ఉంటున్నాం. ఇప్పుడు ఓబీసీ సర్టిఫికెట్‌ ఎవరి పేరుతో తీసుకోవాలి?

Published : 30 Jun 2022 00:08 IST

గ్రాడ్యుయేషన్‌ చేసి గ్రూప్‌-1 ఉద్యోగానికి దరఖాస్తు చేశాను. నా సర్టిఫికెట్లన్నీ డాటరాఫ్‌ అంటూ నాన్న పేరుతో ఉన్నాయి. నాకు పెళ్లైనా కొన్ని కారణాల వల్ల వేర్వేరుగా ఉంటున్నాం. ఇప్పుడు ఓబీసీ సర్టిఫికెట్‌ ఎవరి పేరుతో తీసుకోవాలి? రిజర్వేషన్‌ కోటా వర్తిస్తుందా?

- అనామిక

వివాహంతో సంబంధం లేకుండా మీకు రిజర్వేషన్‌ కోటా వర్తిస్తుంది. వివాహం తరువాత సర్టిఫికెట్లలో తండ్రి పేరును మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు తీసుకోబోయే ఓబీసీ సర్టిఫికెట్‌ని కూడా మీ నాన్న గారి పేరుతోనే ఇస్తారు. ఒక వ్యక్తి కులం వివాహం ద్వారా మారదు కాబట్టి, కుల ధ్రువీకరణ పత్రాలు ఎప్పుడూ తండ్రి/ తల్లి పేరుతోనే ఉంటాయి. ఒకవేళ మీరు ఓబీసీలో నాన్‌ క్రీమీలేయర్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేస్తే, దాని కోసం కూడా మీ నాన్నగారి ఆదాయాన్నే ప్రాతిపదికగా తీసుకుంటారు.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని