కంప్యూటర్స్‌లో పీజీ చేశాక..

ఎంఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చదువుతున్నాను. ఈ కోర్సుతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉండే ఉద్యోగ అవకాశాల గురించి తెలుపగలరు.

Updated : 04 Jul 2022 00:34 IST

ఎంఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చదువుతున్నాను. ఈ కోర్సుతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉండే ఉద్యోగ అవకాశాల గురించి తెలుపగలరు.

- జి. సురేష్‌

* ఎంఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చదివినవారికి ప్రభుత్వ రంగంతో పోలిస్తే, ప్రైవేటు రంగంలోనే ఉద్యోగావకాశాలు ఎక్కువ. ప్రైవేటు రంగంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, సాఫ్ట్‌వేర్‌ క్వాలిటీ అనలిస్ట్‌, డేటా సైంటిస్ట్‌, సాఫ్ట్‌వేర్‌ వాలిడేషన్‌ ఇంజినీర్‌, సాఫ్ట్‌వేర్‌ టెస్ట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ సపోర్ట్‌ ఇంజినీర్‌, ఐటీ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌, ఐటీ ఆడిటర్‌, సిస్టమ్స్‌ ప్రోగ్రామర్‌, సిస్టమ్స్‌ మేనేజర్‌, సిస్టమ్స్‌ అనలిస్ట్‌ లాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. ఎంఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) అనేది ఒక డిగ్రీ మాత్రమే. డిగ్రీతో పాటు ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌, ప్రాబ్లం సాల్వింగ్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలూ చాలా అవసరం. ఇక ప్రభుత్వ రంగానికొస్తే వివిధ ప్రభుత్వరంగ అండర్‌ టేకింగ్‌ సంస్థలు, బ్యాంకులు, యూనివర్సిటీలు, ఎయిర్‌ పోర్ట్‌లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పరిమిత సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. పీజీ కంప్యూటర్‌ సైన్స్‌తోపాటు మరికొన్ని ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌, కోడింగ్‌ సంబంధిత కోర్సులు కూడా చేసి మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని