సాఫ్ట్‌వేర్‌కు మారాలంటే?

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేసి 5 ఏళ్లుగా మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో పనిచేస్తున్నాను. సాఫ్ట్‌వేర్‌ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అటువైపు వెళ్లాలనుకుంటున్నాను. దాని కోసం ఏ కోర్సులు చదవాలి?

Updated : 06 Jul 2022 05:40 IST

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేసి 5 ఏళ్లుగా మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో పనిచేస్తున్నాను. సాఫ్ట్‌వేర్‌ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అటువైపు వెళ్లాలనుకుంటున్నాను. దాని కోసం ఏ కోర్సులు చదవాలి?

- హరిచరణ్‌

మీ అనుభవాన్ని బట్టి ళీతిశి కోర్సు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో మీరు ఏయే విభాగాల్లో పనిచేశారో, ఏ విభాగంలో మీకు ఆసక్తి ఉందో ళీతిశి లో సంబంధిత మాడ్యూల్‌ని చేయండి. ఐటీ ఉద్యోగాలు అంటే టెస్టింగ్‌, డెవలపింగ్‌ మాత్రమే కాదు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివి, మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో ఉద్యోగానుభవం ఉన్న మీకు మెకానికల్‌ డిజైన్స్‌, డ్రాయింగ్‌, అనాలిసిస్‌ల్లో కూడా ఐటీ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌ కోర్సులు చేయండి. డేటా సైన్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ లాంటి కోర్సులు చేసి ఆ రంగంలోనూ ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. సాధారణంగా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన ఫ్రెషర్స్‌కు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగావకాశాలు ఎక్కువ. కాబట్టి మీకు అనుభవమున్న మెకానికల్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగాల్లోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకోసం ప్రయత్నించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని