పీజీ లేకుండా పీహెచ్‌డీ?

కెమికల్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసి (ఎన్‌ఐటీ, దుర్గాపూర్‌) క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ సాధించాను. గణితంలో పీహెచ్‌డీ చేయాలనుంది. పీజీ లేకుండా ఇది సాధ్యమేనా?

Updated : 11 Jul 2022 06:58 IST

కెమికల్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసి (ఎన్‌ఐటీ, దుర్గాపూర్‌) క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ సాధించాను. గణితంలో పీహెచ్‌డీ చేయాలనుంది. పీజీ లేకుండా ఇది సాధ్యమేనా?

- సుమన్‌ తేజ్‌ బదావత్‌

ప్రపంచవ్యాప్తంగా ఇటీవలికాలంలో మల్టీ డిసిప్ల్లినరీ పరిశోధనలకు ప్రాధాన్యం పెరుగుతోంది. కానీ మనదేశంలో ఐఐటీ/ యూనివర్సిటీల్లో, ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ నిబంధనల ప్రకారం, మేథమెటిక్స్‌లో పీహెచ్‌డీ చేయాలంటే గణితంలో కచ్చితంగా ఎంఎస్సీ/ఎంఏ చదివి ఉండాలి. జాతీయ విద్యావిధానం-2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే మాత్రం ఈ విషయంలో వెసులుబాటు ఇవ్వొచ్చు. బీటెక్‌ డిగ్రీతో పాటు, మేథమెటిక్స్‌ సబ్జెక్ట్‌లో అత్యంత విషయపరిజ్ఞానం కలిగినవారికి టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌, చెన్నై మేథమెటికల్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌, ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమెటికల్‌ సైన్సెస్‌ లాంటి అతికొద్ది పరిశోధన సంస్థల్లో మేథమెటిక్స్‌లో పీహెచ్‌డీ చేయడానికి అర్హత ఉంది. అయితే, మీరు ప్రవేశ పరీక్ష/ ఇంటర్వ్యూల్లో ఎంఎస్సీ/ఎంఏ మేథమెటిక్స్‌ చదివినవారితో పోటీపడవలసి ఉంటుంది. విదేశాల్లో చాలాచోట్ల నాలుగు సంవత్సరాల డిగ్రీ తరువాత పీజీ చేయకుండానే నచ్చిన సబ్జెక్టులో పీహెచ్‌డీ… చేసే అవకాశం ఉంటుంది.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని