ఏం చేస్తే మేలు?

ఎథికల్‌ హ్యాకింగ్‌ అనేది ఒక ప్రత్యేకమైన రంగం. ఈ రంగంలో రాణించాలంటే విపరీతమైన ఆసక్తి, విషయ పరిజ్ఞానం చాలా అవసరం. ఈ రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న సవాళ్ళ దృష్ట్యా నిత్యం కొత్త విషయాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎథికల్‌ హ్యాకింగ్‌లో

Published : 14 Jul 2022 00:48 IST

అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ డిగ్రీ చేశాను. ఎథికల్‌ హ్యాకింగ్‌పై ఆసక్తి. కానీ త్వరగా ఉద్యోగం రావాలంటే సీ, సీ++, పైతాన్‌ నేర్చుకోమంటున్నారు స్నేహితులు. ఏం చేస్తే బాగుంటుంది?

- కృష్ణ

ఎథికల్‌ హ్యాకింగ్‌ అనేది ఒక ప్రత్యేకమైన రంగం. ఈ రంగంలో రాణించాలంటే విపరీతమైన ఆసక్తి, విషయ పరిజ్ఞానం చాలా అవసరం. ఈ రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న సవాళ్ళ దృష్ట్యా నిత్యం కొత్త విషయాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎథికల్‌ హ్యాకింగ్‌లో శిక్షణ పొందినవారికి పెనట్రేషన్‌ టెస్టర్‌, వల్నరబిలిటీ అసెసర్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌, సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకర్‌, సెక్యూరిటీ ఇంజినీర్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ మేనేజర్‌ లాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. నెట్‌ వర్కింగ్‌, కంప్యూటర్‌ సిస్టమ్స్‌, వివిధ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌, వివిధ రకాల పాస్‌వర్డ్స్‌ను ఛేదించగలగటం, ఎథికల్‌ హ్యాకింగ్‌పై పూర్తి పరిజ్ఞానం, ఎన్‌క్రిప్షన్‌, క్రిప్టోగ్రఫీ, కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌, ప్రొఫెషనల్‌ కాండక్ట్‌లపై పట్టు సాధించాలి. ఎథికల్‌ హ్యాకింగ్‌లో నిలదొక్కుకోవాలంటే, సీ, సీ++, పైతాన్‌, ఎస్‌క్యూఎల్‌, జావా, పీహెచ్‌పీ..లాంటి కోడింగ్‌ లాంగ్వేజ్‌లూ నేర్చుకోవాల్సిందే. కాబట్టి మీరు సీ, సీ++, పైతాన్‌లు నేర్చుకోవడం ద్వారా
ఎథికల్‌ హ్యాకింగ్‌తో పాటు, ఇతర సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలనూ ప్రయత్నించవచ్చు.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని