ఏ పుస్తకాలు మేలు?

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి ముందుగా క్వాలిఫయింగ్‌ పరీక్ష ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణత సాధించినవారు మాత్రమే రెండో దశ పరీక్షకు అర్హులు అవుతారు. క్వాలిఫయింగ్‌ పరీక్షలో వచ్చిన మార్కులు తుది ఎంపికలో పరిగణించరు. క్వాలిఫయింగ్‌ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.

Published : 01 Aug 2022 00:52 IST

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ కావాలనుకుంటున్నాను. దీనికి ఏ పుస్తకాలు చదవాలో చెప్పగలరు. - జి. వాణీప్రియ

* ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి ముందుగా క్వాలిఫయింగ్‌ పరీక్ష ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణత సాధించినవారు మాత్రమే రెండో దశ పరీక్షకు అర్హులు అవుతారు. క్వాలిఫయింగ్‌ పరీక్షలో వచ్చిన మార్కులు తుది ఎంపికలో పరిగణించరు. క్వాలిఫయింగ్‌ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. అందులో మొదటిది జనరల్‌ ఇంగ్లిష్‌, రెండోది మేథమెటిక్స్‌ (10వ తరగతి స్థాయి). జనరల్‌ ఇంగ్ల్లిష్‌ కోసం ఆబ్జెక్టివ్‌ జనరల్‌ ఇంగ్లిష్‌ (ఎస్‌ చాంద్‌), ఆబ్జెక్టివ్‌ ఇంగ్లిష్‌ ఫర్‌ జనరల్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్స్‌ (పియర్‌సన్‌), ఆబ్జెక్టివ్‌ జనరల్‌ ఇంగ్లిష్‌ (అరిహంత్‌), ఇంగ్లిష్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్స్‌ (ఎస్‌ చాంద్‌) లాంటి పుస్తకాలను చదవండి. మేథమెటిక్స్‌ కోసం హైస్కూల్‌ మేథమెటిక్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (ఎస్‌ చాంద్‌), టీచ్‌ యువర్‌ సెల్ఫ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (మెక్‌ గ్రాహిల్‌) లాంటి పుస్తకాలను చదవండి. రెండో దశలో జనరల్‌ స్టడీస్‌, ఒక ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లో రెండు పరీక్షలుంటాయి. జనరల్‌ స్టడీస్‌ కోసం తెలుగు అకాడెమీ, అరిహంత్‌, లూసెంట్‌ లాంటి పబ్లిషర్లు ప్రచురించిన పుస్తకాలను చదవండి. ఆప్షనల్‌ పేపర్‌ విషయానికొస్తే, మీరు ఎంచుకొన్న ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ సిలబస్‌ను అనుసరించి ప్రామాణిక పుస్తకాలను చదివి సొంత నోట్స్‌ ఆధారంగా తయారవ్వండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని