సీటెట్‌ రాయాలంటే...

సీటెట్‌ (సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)కు సన్నద్ధం అవుతున్నాను. ఈ పరీక్షకు ఎలా సిద్ధం కావాలి?

Published : 03 Aug 2022 01:08 IST

సీటెట్‌ (సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)కు సన్నద్ధం అవుతున్నాను. ఈ పరీక్షకు ఎలా సిద్ధం కావాలి?

- శ్రేయా యాదవ్‌

పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. ఉపాధ్యాయ నియామకాల్లో ప్రమాణాలను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ  టెస్ట్‌ (సీటెట్‌)నూ, రాష్ట్ర ప్రభుత్వాలు టీచర్‌ ఎలిజిబిలిటీ  టెస్ట్‌ (టెట్‌)నూ నిర్వహిస్తున్నాయి. సీటెట్‌ విషయానికొస్తే, ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించడానికి సీటెట్‌ పేపర్‌ -1 లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పేపరు ఐదు సెక్షన్‌లతో రెండున్నర గంటల వ్యవధితో ఉంటుంది.  ఈ పరీక్షలో చైల్డ్‌ డెవలప్‌ మెంట్‌ అండ్‌ పెడగాజీ, లాంగ్వేజ్‌-1, లాంగ్వేజ్‌-2, మేథమెటిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ల్లో, ఒక్కో సెక్షన్‌ లో 30 చొప్పున 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించడానికి సీటెట్‌ పేపర్‌ -2లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పేపర్‌ నాలుగు సెక్షన్‌లతో రెండున్నర గంటల వ్యవధితో ఉంటుంది. ఈ పరీక్షలో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజీ, లాంగ్వేజ్‌-1, లాంగ్వేజ్‌-2, మేథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌/ సోషల్‌ స్టడీస్‌ ల్లో 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. సీటెట్‌లో తప్పు సమాధానాలకు నెగిటివ్‌ మార్కులు లేవు. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజీలో విద్యా మనస్తత్వశాస్త్రంపై, 6-11/11-14 వయసు వారికి సంబంధించిన బోధన, విభిన్న అభ్యాసకుల లక్షణాలు, వారి అవసరాలను అర్థం చేసుకోవడం, మంచి బోధకుల లక్షణాలపై ప్రశ్నలుంటాయి. సీటెట్‌ పరీక్ష కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఉన్న సిలబస్‌కు అనుగుణంగా సొంతంగా నోట్స్‌ తయారు చేసుకోవాలి. సైకాలజీ, మేథమెటిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ల కోసం వైలీ, పియర్‌ సన్‌, అరిహంత్‌, దిశ లాంటి పబ్లిషర్లు ప్రచురించిన ప్రామాణిక పుస్తకాలను చదవండి. గత పరీక్షపత్రాల్లో వచ్చిన ప్రశ్నల సరళిని గమనించి, అందుకు తగ్గట్టుగా సన్నద్ధంకండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు