మెడికల్‌ కోడింగ్‌లో...

మా అమ్మాయికి బీఫార్మసీ పూర్తికాబోతోంది. మెడికల్‌ కోడింగ్‌ కోర్సు చదవాలనుకుంటోంది. దీంట్లో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

Updated : 15 Aug 2022 12:10 IST

మా అమ్మాయికి బీఫార్మసీ పూర్తికాబోతోంది. మెడికల్‌ కోడింగ్‌ కోర్సు చదవాలనుకుంటోంది. దీంట్లో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? - వెంకటరమణ

బీఫార్మసీ పూర్తి చేశాక కొన్ని స్వల్పకాలిక కోర్సులు చేసి మెడికల్‌ కోడర్స్‌ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. మెడికల్‌ కోడింగ్‌లో శిక్షణ పూర్తిచేసినవారికి కార్పొరేట్‌ ఆసుపత్రులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, ఫార్మా కంపెనీల్లో ఉద్యోగావకాశాలుంటాయి. విదేశీ సంస్థలు కూడా ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా మెడికల్‌ కోడర్స్‌ నియామకాలు చేపడుతున్నాయి. కరోనా సంక్షోభం తరువాత మెడికల్‌ కోడర్స్‌కు డిమాండ్‌ పెరిగింది. ఈ రంగంలోకి ప్రవేశించాలంటే హ్యూమన్‌ అటానమీ, ఫార్మా, బయాలజీలపై ప్రాథ]మిక అవగాహన ఉండాలి. మెడికల్‌ కోడింగ్‌ స్వల్పకాలిక కోర్సులు చేసి, పరీక్ష రాసి ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ పొందాలి. దాన్ని ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవాలి. ఆ తరువాత యునైటెడ్‌ హెల్త్‌ గ్రూప్‌, ఒమేగా, సదర్లాండ్‌ హెల్త్‌ కేర్‌, ఫైకేర్‌, ఎలికో హెల్త్‌ కేర్‌, ఏజిస్‌, మెడ్‌టెక్‌ లాంటి సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని