ఏ కోర్సు చేస్తే మేలు?

బీఎస్సీ తరువాత మేథమెటిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ల్లో మీకు నచ్చిన సబ్జెక్ట్‌లో ఎమ్మెస్సీ చేయొచ్చు. ఎమ్మెస్సీ చేసిన తరువాత ఆసక్తి ఉంటే బోధన రంగంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి.  బీఈడీ/డీ…ఈడీ చేసి ప్రభుత్వ/ ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించవచ్చు

Published : 11 Aug 2022 00:48 IST

బీఎస్సీ (మేథమెటిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌) ఈమధ్యే పూర్తిచేశాను. దీని తర్వాత ఏ కోర్సు చేస్తే మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయి?

- వి. ఉదిత్‌ నారాయణ్‌

బీఎస్సీ తరువాత మేథమెటిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ల్లో మీకు నచ్చిన సబ్జెక్ట్‌లో ఎమ్మెస్సీ చేయొచ్చు. ఎమ్మెస్సీ చేసిన తరువాత ఆసక్తి ఉంటే బోధన రంగంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి.  బీఈడీ/డీ…ఈడీ చేసి ప్రభుత్వ/ ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించవచ్చు. క్రీడల్లో ఆసక్తి ఉంటే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో బీపీఈడీ చేయొచ్చు. ఇంగ్లిష్‌/ తెలుగు భాషలపై ఆసక్తి ఉంటే ఆ సబ్జెక్టుల్లో కూడా పీజీ చేయొచ్చు. మేనేజ్‌మెంట్‌ రంగంలోకి ప్రవేశించాలనుకొంటే ఎంబీఏ, పత్రికా రంగంలోకి వెళ్లాలనుకొంటే జర్నలిజం, కంప్యూటర్‌ రంగంలో స్థిరపడాలనుకొంటే ఎంసీఏ, న్యాయరంగంపై ఆసక్తి ఉంటే బీఎల్‌, గ్రంథాలయాల్లో ఉద్యోగాలకోసం లైబ్రరీ సైన్స్‌ లాంటి కోర్సులు చేయటానికి వీలుంది. డేటాసైన్స్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే, ఎంఎస్‌ ఎక్సెల్‌, ఆర్‌ ప్రోగ్రామింగ్‌, పైతాన్‌, మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి కోర్సులు చేయండి. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ప్రవేశించదలిస్తే ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ నెట్‌ వర్కింగ్‌, వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ లాంటి కోర్సుల్లో శిక్షణ పొంది నచ్చిన ఉద్యోగంలో స్థిరపడండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని