సివిల్స్‌కు ఏది మేలు?

ఇంటర్‌ పాసయ్యాను. సివిల్‌ సర్వీసెస్‌  సాధించాలనేది నా లక్ష్యం. సాధారణ డిగ్రీ, బీటెక్‌.. ఈ రెండింటిలో ఎందులో చేరితే సివిల్స్‌ సులువవుతుంది?

Published : 16 Aug 2022 00:51 IST

ఇంటర్‌ పాసయ్యాను. సివిల్‌ సర్వీసెస్‌  సాధించాలనేది నా లక్ష్యం. సాధారణ డిగ్రీ, బీటెక్‌.. ఈ రెండింటిలో ఎందులో చేరితే సివిల్స్‌ సులువవుతుంది?

- సీహెచ్‌. లక్ష్మయ్య

* సాధారణ డిగ్రీ లేదా ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతూ సివిల్స్‌కు సన్నద్ధం కావచ్చు. సివిల్‌ సర్వీసెస్‌ సాధించాలన్న లక్ష్యం బలంగా ఉంటే ఏ కోర్సులో చేరినప్పటికీ విజయం సాధించవచ్చు. సోషల్‌ సైన్సెస్‌లో డిగ్రీ చేస్తూ సివిల్స్‌కు సన్నద్ధమయితే హిస్టరీ, ఎకానమీ, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఫిలాసఫీ, సోషియాలజీ, ఆంత్రొపాలజీ, రూరల్‌ డెవలప్‌మెంట్ లాంటి సబ్జెక్టులపై ప్రాథ]మిక అవగాహన ఉంటుంది. ఆ తరువాత, మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేస్తే, అదే సబ్జెక్టును ఆప్షనల్‌గా తీసుకొని సివిల్స్‌ పరీక్ష రాయవచ్చు. సాధారణ డిగ్రీకి  బదులుగా, ఇంజినీరింగ్‌ డిగ్రీ చేస్తే ఎకాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలపై అవగాహన వస్తుంది. ఇంజినీరింగ్‌ కోర్సు చదవడం వల్ల లాజికల్‌ థింకింగ్‌, అనలిటికల్‌ థింకింగ్‌, ప్రాబ్ల్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఇంజినీరింగ్‌ చేసిన చాలామంది అభ్యర్ధులు సివిల్స్‌లో సోషల్‌ సైన్స్‌, లిటరేచర్‌ సబ్జెక్టులను ఆప్షనల్‌గా తీసుకొంటున్నారు. ఈ రెండు రకాల డిగ్రీలకూ కొన్ని అనుకూలతలూ, ఇబ్బందులూ ఉన్నాయి. ఒకవేళ సివిల్స్‌ సాధించలేకపోతే, సాధారణ డిగ్రీ చదివినవారికంటే, ఇంజినీరింగ్‌ చదివినవారికి వేరే ఉద్యోగం త్వరగా వచ్చే అవకాశం ఉంది. పత్రికా పఠనంతోపాటు ఎడిటోరియల్‌ పేజీల్లో వచ్చే వ్యాసాలను చదివి సొంతంగా నోట్స్‌ తయారుచేసుకోండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని