క్రీడలో కెరియర్‌?

బీఏ ఆనర్స్‌ పబ్లిక్‌ పాలసీ చదువుతున్నాను. క్రీడలంటే ఆసక్తి ఎక్కువ. ఐదేళ్లుగా విదేశాల్లోనూ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొన్నాను. ఈ క్రీడలోనే కెరియర్‌ను ఎంచుకోవాలంటే ఏ కోర్సు చేయాలి?

Published : 22 Aug 2022 00:44 IST

బీఏ ఆనర్స్‌ పబ్లిక్‌ పాలసీ చదువుతున్నాను. క్రీడలంటే ఆసక్తి ఎక్కువ. ఐదేళ్లుగా విదేశాల్లోనూ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొన్నాను. ఈ క్రీడలోనే కెరియర్‌ను ఎంచుకోవాలంటే ఏ కోర్సు చేయాలి?

- జి.సిరి

* పబ్లిక్‌ పాలసీ లాంటి వినూత్న కోర్సును ఎంచుకొని, బాక్సింగ్‌ క్రీడలోనూ రాణిస్తున్నందుకు అభినందనలు. బాక్సింగ్‌ కొనసాగిస్తూనే, డిగ్రీనీ పూర్తి చేయండి. మనదేశంలో బాక్సింగ్‌ క్రీడలో డిగ్రీ/ పీజీ కోర్సులు అందుబాటులో లేవు. విదేశాల్లో కూడా కొద్ది వర్సిటీల్లో మాత్రమే బాక్సింగ్‌లో డిగ్రీ కోర్సులు ఉన్నాయి. యుడెమి, కోర్స్‌ఎరాల్లో బాక్సింగ్‌లో ఆన్‌లైన్‌ కోర్సులున్నాయి. డిగ్రీ చేస్తూనే, ఇలాంటివి ప్రయత్నం చేయండి. అంతకంటేముందు బాక్సింగ్‌లో ఏ రంగంలో స్థిరపడాలనుకొంటున్నారో నిర్ణయించుకొని తగిన కోర్సును విదేశాల్లో చేసే ప్రయత్నం చేయండి. బీఏ తరువాత, పబ్లిక్‌ పాలసీలో పీజీ కోర్సును విదేశాల్లో చదువుతూ, బాక్సింగ్‌లో సర్టిఫికెట్‌/డిప్లొమా/ డిగ్రీ కోర్సులు చేస్తూ, బాక్సింగ్‌లో కెరియర్‌ను కొనసాగించండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని