జేఎల్‌, డీఎల్‌ రాయడానికి...

బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) చేశాను. ఎమ్మే చదవాలనుకుంటున్నాను. పీజీలో ఏ సబ్జెక్టులు చదివితే జేఎల్‌, డీఎల్‌ పరీక్షలు రాయడానికి వీలుంటుంది?

Published : 25 Aug 2022 00:21 IST

బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) చేశాను. ఎమ్మే చదవాలనుకుంటున్నాను. పీజీలో ఏ సబ్జెక్టులు చదివితే జేఎల్‌, డీఎల్‌ పరీక్షలు రాయడానికి వీలుంటుంది?

- ఎం.సంధ్య

* బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) తరువాత ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చేయొచ్చు. కొన్ని యూనివర్సిటీల్లో బీటెక్‌ విద్యార్హతతో ఎమ్మెస్సీ (మేథమేటిక్స్‌) చేసే అవకాశం కూడా ఉంది. మరికొన్ని యూనివర్సిటీల్లో బీటెక్‌ విద్యార్హతతో ఎమ్మేలో పొలిటికల్‌ సైన్స్‌/ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌/ హిస్టరీ/ ఆంత్రొపాలజీ /సోషియాలజీ/సైకాలజీ/ ఇంగ్లిష్‌ చదవొచ్చు. బీటెక్‌ చదివినవారికి ఎంబీఎ/ ఎంసీఏ/ జర్నలిజం చదివే అర్హత కూడా ఉంటుంది. పైన చెప్పినవాటిలో మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేసి జేెఎల్‌/ డీ…ఎల్‌ పరీక్షలు రాయండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని