ఇంజినీరింగ్‌ తర్వాత ఏ ప్రభుత్వ కొలువులు?

బీటెక్‌ (మెకానికల్‌) రెండేళ్ల కిందట పాసయ్యాను. ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నా. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలనుకుంటున్నాను. ఈ అర్హతతో ఏ ప్రభుత్వ ఉద్యోగాలుంటాయి?

Published : 29 Aug 2022 01:06 IST

బీటెక్‌ (మెకానికల్‌) రెండేళ్ల కిందట పాసయ్యాను. ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నా. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలనుకుంటున్నాను. ఈ అర్హతతో ఏ ప్రభుత్వ ఉద్యోగాలుంటాయి?

- కార్తీక్‌

* బీటెక్‌ మెకానికల్‌ చదివినవారు యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ రాయటానికి అర్హులవుతారు. భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, కోల్‌ ఇండియా, గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, ఎన్టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌ గ్రిడ్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇంజినీర్స్‌ ఇండియా, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌, మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌, నేషనల్‌ అల్యూమినియం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లాంటి  ప్రభుత్వరంగ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలుగా, ఇంజినీర్‌ ట్రైనీలుగా ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. పైవాటిలో చాలా సంస్థలు గేట్‌ పరీక్షలో వచ్చిన స్కోరు ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతాయి. డీ…ఆర్‌డీవో లాంటి రక్షణ సంస్థల్లో, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. రాష్ట్ర రోడ్‌ రవాణా సంస్థల్లో కూడా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారికి కొలువులు లభిస్తాయి. వీటితో పాటు డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించవచ్చు.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని