వ్యాకరణం సరిదిద్దే యాప్‌లున్నాయా?

ఇంగ్లిష్‌లో రాసిన విషయాల్లో వ్యాకరణ దోషాలు కనిపెట్టి సరిదిద్దే యాప్‌లున్నాయా? ఉద్యోగరీత్యా ఎక్కువగా డ్రాఫ్టింగ్‌ పని ఉంటుంది. ఈ నైపుణ్యాలను మెరుగుపరుచు కోవాలంటే ఏం చేయాలి?

Published : 05 Sep 2022 01:25 IST

ఇంగ్లిష్‌లో రాసిన విషయాల్లో వ్యాకరణ దోషాలు కనిపెట్టి సరిదిద్దే యాప్‌లున్నాయా? ఉద్యోగరీత్యా ఎక్కువగా డ్రాఫ్టింగ్‌ పని ఉంటుంది. ఈ నైపుణ్యాలను మెరుగుపరుచు కోవాలంటే ఏం చేయాలి?

- జి. శివశంకర్‌రెడ్డి

ఇంగ్లిష్‌ మన మాతృభాష కాదు కాబట్టి వ్యాకరణ దోషాలు సహజమే. మనలో చాలామంది ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడగల్గినా రాయడంలో తప్పులు చేస్తారు. వ్యాకరణ దోషాలు కనిపెట్టి సరిదిద్దటానికి వివిధ రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా గ్రామర్లి, జింజర్‌, ప్రూఫ్‌ రీడర్‌, స్క్రిబెన్స్‌, లింగ్వీక్స్‌ లాంటివి ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆంగ్లంలో డ్రాఫ్టింగ్‌ మెలకువలు పెంచుకోవాలంటే ముందుగా మీకు గ్రామర్‌పై మంచి పట్టు ఉండాలి. అందుకోసం మొదటగా హైస్కూల్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌ అండ్‌ కంపోజిషన్‌ (రెన్‌ అండ్‌ మార్టిన్‌) పుస్తకాన్ని చదివి, బాగా సాధన చేయండి. ఆంగ్ల పదసంపద పెంచుకోవడానికి ఏదైనా ఒక ఆంగ్ల వార్తాపత్రిక క్రమం తప్పకుండా చదవండి. మీరు ఎంత ఎక్కువగా సాధన చేస్తే, అంత తక్కువ దోషాలతో రాయగలరు. యాప్‌ల ద్వారా రాసే భాషను మెరుగుపర్చుకొనే క్రమంలో మీరు ఎక్కువగా ఎలాంటి తప్పులు చేస్తున్నారో, ఆ తప్పులు ఎలా సరి అవుతున్నాయో తెలుసుకొని మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని