సైకాలజీ చేశాక..?

బీటెక్‌ (ఈసీఈ) చదివి సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నా. సైకాలజీలో పీజీ చేయాలనుంది. ఈ కోర్సుతో ఉండే ఉద్యోగావకాశాల గురించి తెలుపగలరు.

Updated : 06 Sep 2022 06:30 IST

బీటెక్‌ (ఈసీఈ) చదివి సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నా. సైకాలజీలో పీజీ చేయాలనుంది. ఈ కోర్సుతో ఉండే ఉద్యోగావకాశాల గురించి తెలుపగలరు.

- కె. సుదీక్ష

సైకాలజీలో పీజీ చేసిన వారు కౌన్సెలర్‌లుగా స్థిరపడే అవకాశం ఉంది. సైకాలజీతో పాటు కెరియర్‌ గైడెన్స్‌లో డిప్లొమా కానీ, సర్టిఫికెట్‌ కోర్సు కానీ చేస్తే కెరియర్‌ కౌన్సిలర్‌గా కూడా అవకాశాలుంటాయి. మీకు సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగానుభవం ఉంది కాబట్టి ట్రైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో ఏదైనా కోర్సు చేసి ట్రైనర్‌గా కూడా రాణించవచ్చు. హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌లో ఏమైనా కోర్సులు చేసి మేనేజ్‌మెంట్‌/ బిజినెస్‌ రంగంలోనూ ప్రవేశించవచ్చు. బీఈడీ, ఎంఈడీ చేసి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో అధ్యాపక వృత్తినీ ఎంచుకోవచ్చు. సైకాలజీలోనే పీహెచ్‌డీ చేసి, ఆ రంగంలోనే అధ్యాపక వృత్తిని చేపట్టవచ్చు. మీకు ఆసక్తి ఉంటే పరిశోధన రంగంలో కూడా ఉద్యోగావకాశాలు ఉంటాయి. హెల్త్‌కేర్‌ రంగంపై ఆసక్తి ఉంటే కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో రోగులకూ, వారి సహాయకులకూ కౌన్సెలింగ్‌ చేసే ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించవచ్చు. స్వచ్ఛంద సేవాసంస్థల్లో, మీడియా రంగంలో సైకాలజీ చదివినవారికి పరిమిత సంఖ్యలో ఉద్యోగాలు ఉంటాయి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని