ఏ కోర్సు చదవాలి?

బీకామ్‌ ఆనర్స్‌ (బిజినెస్‌ ఎనలిటిక్స్‌) చదువుతున్నాను. ఐటీ రంగంలో ఉద్యోగం సంపాదించాలంటే ఏ కోర్సులు చదవాలో తెలుపగలరు.

Updated : 07 Sep 2022 06:16 IST

బీకామ్‌ ఆనర్స్‌ (బిజినెస్‌ ఎనలిటిక్స్‌) చదువుతున్నాను. ఐటీ రంగంలో ఉద్యోగం సంపాదించాలంటే ఏ కోర్సులు చదవాలో తెలుపగలరు.

- ఎం.ముస్తాక్‌

బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సులు చేసినవారికి మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయి. కానీ, ఈ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులవల్ల మీరు డిగ్రీలో చదివిన సిలబస్‌కు తోడుగా మరికొన్ని కోర్సులు చేస్తే ఐటీ ఉద్యోగం సంపాదించవచ్చు. ఈ రంగంలో స్థిరపడాలనుకొంటే స్టాటిస్టిక్స్‌, ఎమ్‌ఎస్‌ ఎక్సెల్‌, ఆర్‌ ప్రోగ్రామింగ్‌, పైతాన్‌, డేటా విజువలైజేషన్‌, మైక్రోసాఫ్ట్‌ పవర్‌ బీఐ, మెషిన్‌ లెర్నింగ్‌, టేబ్ల్యు, ఎస్‌క్యూఎల్‌లపై గట్టి పట్టు సాధించాలి. వీటితో పాటు డేటా మైనింగ్‌, బ్లాక్‌ చైన్‌, డేటా మోడలింగ్‌లపై కూడా మంచి అవగాహన ఉంటే ఈ రంగంలో రాణించడం కష్టం కాదు.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని