కోడింగ్‌కు ఏది మంచిది?

మా అమ్మాయి ఇంజినీరింగ్‌ కోర్సులో చేరబోతోంది. కోడింగ్‌ నేర్చుకోవడానికి ఏ ల్యాప్‌టాప్‌ అనువుగా ఉంటుంది?

Published : 13 Sep 2022 01:11 IST

మా అమ్మాయి ఇంజినీరింగ్‌ కోర్సులో చేరబోతోంది. కోడింగ్‌ నేర్చుకోవడానికి ఏ ల్యాప్‌టాప్‌ అనువుగా ఉంటుంది?

- జయశ్రీ

టీవలి కాలంలో ల్యాప్‌టాప్‌ విద్యావ్యవస్థలో ఒక భాగం అయింది. ముందుగా మీ అమ్మాయి చదవబోయే కోర్సు, ఆ కోర్సుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ల గురించి వారి సీనియర్‌ విద్యార్థులనూ, అధ్యాపకులనూ అడిగి తెలుసుకోవాలి. ల్యాప్‌టాప్‌ కొనడానికి మీ బడ్జెట్‌ ఎంత అనేది కూడా ముఖ్యం. 50,000 నుంచి 60,000 రూపాయిల్లో మంచి ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వేగవంతమైన ప్రాసెసర్‌ కంపైల్‌ సమయాన్ని వేగవంతం చేస్తుంది. మల్టీ టాస్కింగ్‌లో సహాయపడుతుంది. క్వాడ్‌-కోర్‌ i5 లేదా అంతకంటే ఎక్కువ ప్రాసెసర్‌ ఉండటం మంచిది. కోడ్‌ను కంపైల్‌ చేస్తున్నప్పుడు కనిష్ఠంగా 8 జీబీ రామ్‌ అవసరం. 13 అంగుళాల తెరపై ప్రోగ్రామింగ్‌ చేయడం అంత సులభం కాదు. 15-అంగుళాలూ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న స్క్రీన్‌కి వెళ్లడానికి ప్రయత్నించండి. ల్యాప్‌టాప్‌కు కీ బోర్డ్‌ కూడా చాలా ప్రధానం. ల్యాప్‌టాప్‌ కొనడానికి ముందు, ల్యాప్‌టాప్‌లో టైపింగ్‌ టెస్ట్‌ని తెరిచి, మీరు నిమిషానికి మీ గరిష్ట పదాలను చేరుకునేలా చూసుకోండి. ల్యాప్‌టాప్‌లో ఎక్కువ స్టోరేజ్‌ స్పేస్‌ ఉంటే కంపైల్‌ సమయాన్ని తగ్గిస్తుంది. మీ ల్యాప్‌టాప్‌లో సాలిడ్‌ స్టేట్‌ డ్రైవ్‌ (ఎస్‌ఎస్‌డీ) ని కనీసం 512 జీబీ ఉండేట్లుగా చూసుకోండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని