ఇంగ్లిష్‌ ఒకాబ్యులరీ నేర్చుకోవాలంటే..

ఇంగ్లిష్‌ ఒకాబ్యులరీ నేర్పే పుస్తకాలు, యాప్‌, వెబ్‌సైట్‌ల వివరాలు తెలపండి….

Published : 14 Sep 2022 00:43 IST

ఇంగ్లిష్‌ ఒకాబ్యులరీ నేర్పే పుస్తకాలు, యాప్‌, వెబ్‌సైట్‌ల వివరాలు తెలపండి….

- సి.రవితేజ

కొత్త భాష నేర్చుకోవాలంటే పదజాలాన్ని పెంచుకోవడం చాలా అవసరం.  సరైన వ్యాకరణ నియమాలు ఎంత అవసరమో, పద సంపద కూడా అంతే ముఖ్యం. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థులు ఈ  విషయంలో వెనకబడుతున్నారు. ఈ  సమస్యను అధిగమించడానికి ఇటీవలికాలంలో చాలా పుస్తకాలు, యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. మెక్‌ గ్రాహిల్‌ ఎసెన్షియల్‌ ఈఎస్‌ఎల్‌ డిక్షనరీ, ఇంగ్లిష్‌ ఒకాబ్యులరీ ఇన్‌ యూజ్‌ సిరీస్‌, ఆక్స్‌ఫర్డ్‌ పిక్చర్‌ డిక్షనరీ, 504 ఆబ్సల్యూట్లీ ఎసెన్షియల్‌ వర్డ్స్‌, ఎన్‌టీసీ ఒకాబ్యులరీ బిల్డర్స్‌, వర్డ్‌ పవర్‌ మేడ్‌ ఈజీ లాంటి పుస్తకాలను చదివి సాధన చేయండి. యాప్‌ల విషయానికొస్తే, BUSUU, MEMRISE, LinGo Play, Quizlet, Alpha bear 2, WordReference, Word of the day లాంటి వాటిని అనుసరించవచ్చు. వీటితోపాటు memorise.com, Ffluentu.com, ఇఫ్లూ యూనివర్సిటీ వారి English Pro app ల ద్వారా కూడా మీ ఆంగ్ల పదజాలాన్నీ, భాష ఉచ్చారణనూ పెంచుకోండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని