Updated : 17 Sep 2022 06:12 IST

ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేసిన వారికి యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌కు అర్హత ఉంటుందా?

- అజయ్‌

జ: యూజీసీ గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారందరికీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసే అర్హత ఉంటుంది.


నేను గ్రూప్‌-4 పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్నాను. ఒకటో తరగతి పెద్దపల్లి జిల్లాలో; రెండు నుంచి నాలుగో తరగతి వరకు సిరిసిల్ల జిల్లాలో; అయిదు నుంచి ఇంటర్‌ వరకు కరీంనగర్‌లో చదివాను (1 - 12 అప్పటి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా). నేను ఏ జిల్లాలో పోస్టులకు ప్రయత్నించవచ్చో తెలియజేయండి.

- జాక్‌

జ: కరీంనగర్‌ జిల్లా పోస్టులకు మీరు పోటీపడవచ్చు.


డీఏఓ ఉద్యోగం వస్తే ఏ ప్రాంతం (గ్రామం/నగరం/హైదరాబాద్‌)లో పనిచేయాల్సి ఉంటుంది?

- నవీన్‌ కుమార్‌

జ: ఇది గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం కాబట్టి ఎంపికైన అభ్యర్థులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా నియమించవచ్చు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని