Published : 19 Sep 2022 01:04 IST

తేల్చుకోలేకపోతున్నా..

ఇంటర్‌ (ఎంపీసీ) పాసై ఎంసెట్‌ రాశాను. సీఏ కోర్సులో చేరాను. కానీ ఎంపీసీ చదవడం వల్ల ఇంజినీరింగ్‌లో చేరితే బాగుంటుంది అనిపిస్తోంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను.

- ఇ. తరుణి

* ఇంటర్‌ (ఎంపీసీ) పాసై సీఏలో చేరాను అన్నారు. ఆ ఆలోచన మార్చుకొని మళ్ళీ ఇంజినీరింగ్‌ వైపునకు ఎందుకు వెళ్లాలనుకొంటున్నారో కనీసం మూడు కారణాలు రాసుకోండి. ఆ కారణాలను మీ కుటుంబ సభ్యులతో, మీ శ్రేయోభిలాషులతో పంచుకొని, అవి సహేతుకమైనవో కావో నిర్ధారించుకోండి. ఆపైనే నిర్ణయం తీసుకోండి. సీఏ కోర్సు, ఇంజినీరింగ్‌ కంటే తక్కువేమీ కాదు. ప్రతి సంవత్సరం ఇంజినీర్లు లక్షల్లో మార్కెట్‌లోకి వస్తూ ఉంటే, సీఏలు మాత్రం కొన్ని వేలమంది మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. ఇంజినీరింగ్‌ చదివినవారిలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. కానీ, సీఏ కోర్సు చేసినవారికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఒకవేళ సీఏ చదవడం కష్టమనిపిస్తే, మీ సీనియర్‌ల సలహాలు తీసుకొని ముందుకెళ్లండి. ముందుగా మీ జీవితం, భవిష్యత్తుపై మీకో స్పష్టత అవసరం. మీకు ఏ రంగంపై ఆసక్తి ఉంది, జీవితంలో ఎలా స్థిరపడాలనుకొంటున్నారు అనేవి దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts