పైలట్‌ అవ్వాలంటే?

బీటెక్‌ (సీఎస్‌ఈ) చదివాను. కమర్షియల్‌ పైలట్‌గా స్థిరపడాలనుకుంటున్నాను. దీని కోసం చదవాల్సిన కోర్సు వివరాలను తెలుపగలరు. 

Published : 21 Sep 2022 00:55 IST

బీటెక్‌ (సీఎస్‌ఈ) చదివాను. కమర్షియల్‌ పైలట్‌గా స్థిరపడాలనుకుంటున్నాను. దీని కోసం చదవాల్సిన కోర్సు వివరాలను తెలుపగలరు.

- స్వరూప్‌

* పైలట్‌ అవ్వడానికి ఇంటర్మీడియట్‌ స్థాయిలో మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌లు కచ్చితంగా చదివివుండాలి. కమర్షియల్‌ పైలట్‌ అవ్వాలంటే మెడికల్‌ సర్టిఫికెట్‌, కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌, ఇంగ్లిష్‌ ప్రొఫిషియెన్సీ సర్టిఫికెట్‌, రేడియో టెలిఫోనీ రెస్ట్రిక్టెడ్‌ సర్టిఫికెట్‌, ఫ్లైట్‌ రేడియో టెలిఫోనీ ఆపరేటర్స్‌ లైసెన్స్‌ కూడా ఉండాలి. డీజీసీఏ ఫ్లైట్‌ క్రూ లైసెన్స్‌ పరీక్ష కోసం ఎయిర్‌ రెగ్యులేషన్స్‌, ఎయిర్‌ నావిగేషన్‌, ఏవియేషన్‌ మెటిరాలజీ, టెక్నికల్‌ జనరల్‌, టెక్నికల్‌ స్పెసిఫిక్‌, రేడియో టెలిఫోనీ లాంటి ఆరు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తరువాత డీజీసీఏ గుర్తింపు పొందిన ఫ్లైట్‌ స్కూల్‌లో కమర్షియల్‌ పైలట్‌ శిక్షణలో చేరి కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ పొందాలి.

కమర్షియల్‌ పైలట్‌కు ప్రత్యేకమైన పీజీ కోర్సులు అవసరం లేదు. మీకు ఆసక్తి ఉంటే ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, ఏవియేషన్‌, ఏరోనాటికల్‌ సైన్స్‌ల్లో ఎంఎస్సీ/ ఎంటెక్‌ కోర్సులు చేయవచ్చు. పైలట్‌ అవ్వాలంటే బలమైన సాంకేతిక నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచన, సరైన నిర్ణయం తీసుకోగలగడం, పరిస్థితుల, పర్యావరణ అవగాహన, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, సునిశిత దృష్టి, క్రమశిక్షణ, మానసిక స్థిరత్వం, శారీరక దృఢత్వం, బృందంలో సమష్టిగా పనిచేయగల సామర్ధ్యం, నాయకత్వ లక్షణాలు చాలా అవసరం.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని