కరెంట్‌ అఫైర్స్‌

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ మిషన్‌లో అత్యంత కీలకమైన ‘లో ఆల్టిట్యూడ్‌ ఎస్కేప్‌ మోటార్‌’ (ఎల్‌ఈఎం) పరీక్షను 2022, ఆగస్టు 10న ఎక్కడ విజయవంతంగా నిర్వహించింది?

Published : 23 Sep 2022 00:47 IST

మాదిరి ప్రశ్నలు

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ మిషన్‌లో అత్యంత కీలకమైన ‘లో ఆల్టిట్యూడ్‌ ఎస్కేప్‌ మోటార్‌’ (ఎల్‌ఈఎం) పరీక్షను 2022, ఆగస్టు 10న ఎక్కడ విజయవంతంగా నిర్వహించింది?

జ: శ్రీహరికోట

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?                                      

జ: ఆగస్టు 9

ఏ రాష్ట్ర యాంటీ కరప్షన్‌ బ్యూరో (ఏసీబీ)ను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది?

జ: కర్ణాటక

చేపల చెవుల్లోని చిన్న ఎముకలైన ఓటోలిత్స్‌ సహాయంతో సముద్ర నీటి ఉష్ణోగ్రతను ఏ సంస్థకు చెందిన  శాస్త్రవేత్తలు గుర్తించారు?

జ: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, బెంగళూరు

భారత్‌లో తయారైన తొలి ఉప్పునీటి లాంతర్‌ను 2022, ఆగస్టు 13న చెన్నైలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ ఆవిష్కరించారు. ఈ లాంతర్‌కు ఏ పేరు పెట్టారు?

జ: రోష్ని

దాదాపు 5,885 మంది విద్యార్థినీ విద్యార్థులు ఎగురుతున్న భారత జాతీయ జెండా రూపంలో నిలబడి ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత పతాకంగా గిన్నిస్‌ రికార్డు సృష్టించిన ఘటన 2022 ఆగస్టులో ఏ నగరంలో చోటుచేసుకుంది?

జ: ఛండీగఢ్‌

భారత స్టాక్‌ మార్కెట్‌ మాంత్రికుడిగా, వారెన్‌ బఫెట్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝన్‌వాలా ఏ నగరంలో మరణించారు? 

జ: ముంబయి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని