Published : 26 Sep 2022 00:47 IST

సిక్స్‌ సిగ్మా బ్లాక్‌ బెల్ట్‌ నేర్చుకుంటే?

మెకానికల్‌ డిప్లొమా చేసి మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలో పదేళ్లు పనిచేశాను. సిక్స్‌ సిగ్మా బ్లాక్‌ బెల్ట్‌ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఈ కోర్సుతో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి?

- ఎస్‌. రవిశంకర్‌

* ఉద్యోగ ప్రపంచంలో వేగంగా వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ఉద్యోగులకు ఎంతో అవసరం. సిక్స్‌ సిగ్మా బ్లాక్‌ బెల్ట్‌ ఒక సంస్థ ఆదాయం పెంచడంలో, ఖర్చు తగ్గించడంలో, నాణ్యతను పెంపొందించడంలో, తక్కువ వనరులతో ఎక్కువ ఉత్పాదకత పెంచడంలో, వినియోగదారులను సంతృప్తిపర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని చేసినవారికి నాయకత్వం, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, సమస్యా పరిష్కారాల్లో మంచి నైపుణ్యాలు ఉంటాయి. ఈ కోర్సు చేసినవారు ఆపరేషన్స్‌ డైరెక్టర్‌, సీనియర్‌ బిజినెస్‌ ప్రాసెస్‌ అనలిస్ట్‌, సీనియర్‌ కంటిన్యువస్‌ ఇంప్రూవ్‌మెంట్‌ లీడర్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌, కన్సల్టెంట్‌, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ లాంటి ఉద్యోగాలకు అర్హులు. ఆటోమోటివ్‌, ఎలక్ట్రానిక్స్‌, హెల్త్‌ కేర్‌, మాన్యుఫాక్చరింగ్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ రంగాల్లో వీరికి ఉద్యోగావకాశాలు ఉంటాయి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts