పీజీ డిప్లొమా చేయాలంటే..

గత ఏడాది ఏపీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాను. ఇప్పుడు హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా కోర్సు చేయాలనుకుంటున్నాను. నాకు అర్హత ఉందా? 

Published : 27 Sep 2022 00:23 IST

గత ఏడాది ఏపీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాను. ఇప్పుడు హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా కోర్సు చేయాలనుకుంటున్నాను. నాకు అర్హత ఉందా? 

 - రాజేష్‌ సెహ్వాగ్‌ 

 

రాష్ట్రంలో డిగ్రీ చదువుకున్నా హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా కోర్సు నిరభ్యంతరంగా చేయవచ్చు. కాకపోతే మీరు డిగ్రీ పొందిన యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉండాలి. మీరు డిగ్రీలో ఏం చదివారో, ఇప్పుడు ఏ కోర్సు, ఏ యూనివర్సిటీలో చదవాలనుకొంటున్నారో చెప్పలేదు. హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, ఉస్మానియా యూనివర్సిటీ, ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, నేషనల్‌ లా యూనివర్సిటీలు పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. ఒక్కో యూనివర్సిటీ, ఒక్కో సమయంలో ప్రకటనలు విడుదలచేస్తుంది. మీరు ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్‌లకు వెళ్ళి, అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ వివరాలు చూసి, నచ్చిన కోర్సుకు మీ విద్యార్హతలు సరిపోతాయో లేదో పరిశీలించి పీజీ డిప్లొమా కోర్సు చేయండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని