మూడునెలల కోర్సులు?

ఇంటర్‌ తర్వాత మూడు నెలల కాలవ్యవధిలో చేయగలిగే కోర్సుల వివరాలు తెలియజేయండి. పెట్టుబడి లేకుండా ఇంటి నుంచి చేయగలిగే జాబ్స్‌ ఏమైనా ఉంటే చెప్పగలరు.

Updated : 28 Sep 2022 06:38 IST

ఇంటర్‌ తర్వాత మూడు నెలల కాలవ్యవధిలో చేయగలిగే కోర్సుల వివరాలు తెలియజేయండి. పెట్టుబడి లేకుండా ఇంటి నుంచి చేయగలిగే జాబ్స్‌ ఏమైనా ఉంటే చెప్పగలరు.

- ఇ.తరుణి

మీరడిగిన కోర్సులు చాలా ఉన్నాయి. ఎంఎస్‌ ఆఫీస్‌, స్పోకన్‌ ఇంగ్లిష్‌, బ్యూటీషియన్‌, ఫొటోగ్రఫీ, నెట్‌వర్కింగ్‌, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, మొబైల్‌ రిపెయిర్‌, ఈకామర్స్‌, సోషల్‌ వర్క్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, రిటైలింగ్‌, టాలీ (అకౌంటింగ్‌), యాక్టింగ్‌, యాంకరింగ్‌, నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, యానిమేషన్‌, మల్టీమీడియా, న్యూట్రిషన్‌, వెబ్‌ డిజైనింగ్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, టూరిస్ట్‌ గైడ్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఫాషన్‌ డిజైన్‌, ఇంటీరియర్‌ డిజైన్‌, యోగా, గ్రాఫిక్‌ డిజైనింగ్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌, ఇన్సూరెన్స్‌, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌, స్టాక్‌ మార్కెట్‌, రియల్‌ ఎస్టేట్‌ లాంటి వాటిగురించి ఆలోచించవచ్చు. ఇంటినుంచే చేయగలిగే ఉద్యోగాల విషయానికొస్తే- పైన చెప్పినవాటిలో శిక్షణ పొందిన తరువాత ఇంటినుండి ఉద్యోగం చేసే అవకాశం ఉన్నవాటిని ఎంచుకోండి. డేటా ఎంట్రీ, కంటెంట్‌ రైటింగ్‌, ట్రాన్స్‌లేషన్‌, వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌, వర్చువల్‌ అసిస్ట్టెంట్‌, ప్రూఫ్‌ రీడర్‌, మెడికల్‌ కోడింగ్‌, కాపీ రైటింగ్‌, ఇన్‌కమ్‌ టాక్స్‌ కన్సల్టెంట్‌, ఆన్‌లైన్‌ ట్యూటర్‌, వెబ్‌సైట్‌ టెస్టర్‌ లాంటి వాటికి ఇంటి నుంచే పనిచేయొచ్చు.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని