ఐటీలో ప్రవేశించాలంటే...?

బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. కానీ ఐటీ రంగంలో స్థిరపడాలని ఉంది. ఇప్పుడు ఏ కోర్సులు నేర్చుకుంటే త్వరగా ఉద్యోగం సంపాదించొచ్చు?  

Published : 04 Oct 2022 01:07 IST

బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. కానీ ఐటీ రంగంలో స్థిరపడాలని ఉంది. ఇప్పుడు ఏ కోర్సులు నేర్చుకుంటే త్వరగా ఉద్యోగం సంపాదించొచ్చు?      

- ఆర్‌.సుచరిత

తర ఇంజినీరింగ్‌ విభాగాలతో పోలిస్తే సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారికి ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు కొంతవరకు తక్కువనే చెప్పవచ్చు. కానీ మీకు ప్రోగ్రామింగ్‌, లాజికల్‌, అనలిటికల్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలుంటే ఐటీలో రాణించడం కష్టమేమీ కాదు. ముందుగా సీ, సీ ప్లస్‌ ప్లస్‌, ఎస్‌క్యూఎల్‌, జావా, ఆర్‌, పైతాన్‌, హెచ్‌టీఎంఎల్‌, పీహెచ్‌పీ లాంటివాటిని నేర్చుకొనే ప్రయత్నం చేయండి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, నెట్‌ వర్కింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగుల్లో నచ్చినవాటిలో శిక్షణ పొంది ఐటీ రంగంలో స్థిరపడే ప్రయత్నం చేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని