బయోటెక్‌ చేశాక....

ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ విద్యార్హతతో బయోమెడికల్‌ ఇంజినీర్‌, బయోకెమిస్ట్‌, బయొలాజికల్‌/ క్లినికల్‌ టెక్నీషియన్‌, మైక్రో బయాలజిస్ట్‌, ప్రాసెస్‌ డెవలప్‌మెంట్‌ సైంటిస్ట్‌, బయోమాన్యుఫాక్చరింగ్‌ స్పెషలిస్ట్‌, బయోటెక్‌ ప్రొడక్ట్‌ అనలిస్ట్‌, రిసెర్చ్‌ సైంటిస్ట్‌, సీనియర్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌ లాంటి ఉద్యోగాలకు అర్హులు అవుతారు.

Published : 11 Oct 2022 00:14 IST

బీఎస్సీ బయోటెక్నాలజీ చదువుతున్నాను. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చేస్తే విత్తన/ వ్యవసాయరంగంలో ఉండే ఉద్యోగావకాశాలు ఏమిటి?

- ఎ. సాయి పవన్‌

* ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ విద్యార్హతతో బయోమెడికల్‌ ఇంజినీర్‌, బయోకెమిస్ట్‌, బయొలాజికల్‌/ క్లినికల్‌ టెక్నీషియన్‌, మైక్రో బయాలజిస్ట్‌, ప్రాసెస్‌ డెవలప్‌మెంట్‌ సైంటిస్ట్‌, బయోమాన్యుఫాక్చరింగ్‌ స్పెషలిస్ట్‌, బయోటెక్‌ ప్రొడక్ట్‌ అనలిస్ట్‌, రిసెర్చ్‌ సైంటిస్ట్‌, సీనియర్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌ లాంటి ఉద్యోగాలకు అర్హులు అవుతారు. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చేసినవారికి బయోటెక్‌, డ్రగ్స్‌, ఫార్మా, కెమికల్‌, ఎన్విరాన్‌మెంట్‌, ఎనర్జీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, బయో ప్రాసెసింగ్‌, క్లినికల్‌ రిసెర్చ్‌, ప్రభుత్వ/ ప్రైవేటు పరిశోధన సంస్థల్లో, విత్తన, వ్యవసాయ రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. విత్తన/ వ్యవసాయ రంగానికొస్తే.. ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ ఎక్స్‌పర్ట్‌, డౌన్‌ స్ట్రీమ్‌ ప్రాసెస్‌ సైంటిస్ట్‌, ఫీల్డ్‌ అప్లికేషన్‌ సైంటిస్ట్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌ మేనేజర్‌, డయాగ్నస్టిక్స్‌ స్పెషలిస్ట్‌, సీడ్‌ ప్రొడక్షన్‌ ఆఫీసర్‌, సీడ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఫామ్‌ /ప్లాంట్‌ సూపర్‌వైజర్‌ లాంటి కొలువులూ అందుబాటులో ఉంటాయి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని