కంప్యూటర్‌ సైన్స్‌తో ఏ అవకాశాలు?

సాధారణంగా ప్రభుత్వరంగ సంస్థల్లో కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచికి సంబంధించిన ఉద్యోగాలు, ఇతర ఇంజినీరింగ్‌ బ్రాంచీల ఉద్యోగాలకంటే తక్కువ సంఖ్యలో ఉంటాయి.

Updated : 17 Oct 2022 00:23 IST

ఐఐటీ గోవాలో బీటెక్‌ (సీఎస్‌ఈ) చేస్తున్నాను. ప్రభుత్వ రంగ, కార్పొరేట్‌ కంపెనీల్లో నాకుండే ఉద్యోగావకాశాలు ఏమిటి?

- డి.బంధ్యానాయక్‌

సాధారణంగా ప్రభుత్వరంగ సంస్థల్లో కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచికి సంబంధించిన ఉద్యోగాలు, ఇతర ఇంజినీరింగ్‌ బ్రాంచీల ఉద్యోగాలకంటే తక్కువ సంఖ్యలో ఉంటాయి. ప్రముఖ ఐటీ కంపెనీలతో పోలిస్తే ప్రభుత్వరంగ సంస్థల్లో వేతనాలు, ప్రమోషన్‌లు కూడా తక్కువగానే ఉంటాయి. కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారు నెట్‌వర్క్‌ ఇంజినీర్‌, ఐటీ సపోర్ట్‌ స్పెషలిస్ట్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, ఐటీ టెక్నీషియన్‌, వెబ్‌ డెవలపర్‌, సిస్టమ్స్‌ ప్రోగ్రామర్‌, సిస్టమ్స్‌ అనలిస్ట్‌, సిస్టమ్స్‌ మేనేజర్‌, సైబర్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌, డేటాబేస్‌ మేనేజర్‌, అప్లికేషన్‌ డెవలపర్‌, హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ లాంటి ఉద్యోగాలు చేయవచ్చు. బీహెచ్‌ఈఎల్‌, బీఈఎల్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, ఈసీఐఎల్‌, ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, డీఆర్‌డిఓ, ఐఓసీఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, సెయిల్‌, సి-డాక్‌, ఇస్రో, ఇండియన్‌ రైల్వేస్‌, బ్యాంకులు, యూనివర్సిటీలు, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ల్లో కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారికి ఉద్యోగావకాశాలుంటాయి. మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే పాలిటెక్నిక్‌ కాలేజీల్లో, కేంద్రీయ విద్యాలయాల్లో, నవోదయ పాఠశాలల్లో కూడా ప్రయత్నించవచ్చు. ఐటీ కంపెనీలతో పాటు రిలయన్స్‌, టాటా, ఆదిత్య బిర్లా, ఎల్‌ అండ్‌ టీ, ఐటీసీ, హిందుస్తాన్‌ యూనిలివర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, బిగ్‌ బాస్కెట్‌, మింత్రా, స్నాప్‌ డీల్‌, పేటీఎం, ఇండియామార్ట్‌, ఈబే, బుక్‌ మై షో, మేక్‌ మై ట్రిప్‌, ఎయిర్‌టెల్‌, బజాజ్‌ లాంటి కార్పొరేట్‌ సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని