అకౌంట్స్‌కు మారొచ్చా?

సీఏ, ఎంబీఏ (హెచ్‌ఆర్‌) చేశాను. ఐటీ కంపెనీలో రెండేళ్లు హెచ్‌ఆర్‌ అధికారిగా పనిచేశాను. అనారోగ్య కారణాలతో ఆరేళ్లు ఖాళీగా ఉన్నాను.

Published : 19 Oct 2022 00:36 IST

సీఏ, ఎంబీఏ (హెచ్‌ఆర్‌) చేశాను. ఐటీ కంపెనీలో రెండేళ్లు హెచ్‌ఆర్‌ అధికారిగా పనిచేశాను. అనారోగ్య కారణాలతో ఆరేళ్లు ఖాళీగా ఉన్నాను. అకౌంట్స్‌ రంగంలో పనిచేయాలంటే ఏ అర్హతలుండాలి? 

- జి.నిఖిల్‌

మీరు ఎంబీఏలో హెచ్‌ఆర్‌ చేసినా, సీఏ కూడా చదివారు కాబట్టి అకౌంట్స్‌ రంగంలో పనిచేయడానికి మీకు విద్యార్హత ఉంది. కాకపోతే, రెండు సంవత్సరాల ఉద్యోగానుభవం హ్యూమన్‌ రిసోర్సెస్‌లో ఉండటం, ఆరేళ్లు ఖాళీగా ఉండటం వల్ల ఇప్పుడు అకౌంట్స్‌ రంగంలోకి వెళ్ళడం కొంత ఇబ్బందే కానీ అసాధ్యం మాత్రం కాదు. ముందుగా మీరు అకౌంట్స్‌లో ప్రాథ]మిక అంశాలను పునశ్చరణ చేసుకొని ఇటీవలికాలంలో ఈ రంగంలో వచ్చిన మార్పులను తెలుసుకోండి. అందుకు అనుగుణంగా అవసరమైన కోర్సులను ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో చేసే ప్రయత్నం చేయండి. అకౌంటింగ్‌తో పాటు కంప్యూటర్‌ వాడకంపై కనీస పరిజ్ఞానం, ఎంఎస్‌ ఎక్సెల్‌, అకౌంటింగ్‌ సంబంధిత సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన పెంచుకోండి. జీఎస్టీ, ఇన్‌కమ్‌టాక్స్‌, ఆడిటింగ్‌ ప్రమాణాలపై కూడా పట్టు సాధించాలి. వీటన్నిటితో పాటు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, విశ్లేషణ సామర్ధ్యం, సమకాలీన వ్యాపార అంశాలు అర్థం చేసుకోవడం చాలా అవసరం.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని