బీబీఏ తర్వాత?

బీబీఏ రెండో సంవత్సరం డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈ-కామర్స్‌ స్పెషలైజేషన్‌తో చదువుతున్నాను. దీని తర్వాత ఏ కోర్సు చేస్తే మంచిది?    

Published : 01 Nov 2022 00:16 IST

* బీబీఏ రెండో సంవత్సరం డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈ-కామర్స్‌ స్పెషలైజేషన్‌తో చదువుతున్నాను. దీని తర్వాత ఏ కోర్సు చేస్తే మంచిది?      

- సీహెచ్‌. సిరి

* మీరు పీజీలో డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈ కామర్స్‌ స్పెషలైజేషన్‌ సంబంధిత కోర్సులు చదవడం శ్రేయస్కరం. బీబీఏ తరువాత కనీసం రెండు సంవత్సరాలు ఈ రంగాల్లో ఏదైనా ఉద్యోగం చేసి CAT,XAT, NMAT, SNAP, MAT,CMAT,IIFT టెస్ట్‌ లాంటి ప్రవేశ పరీక్షలు రాసి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంబీఏ చేసే ప్రయత్నం చేయండి. చాలా ఎంబీఏ కళాశాలల్లో డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈ కామర్స్‌ లాంటి స్పెషలైజేషన్‌లు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌ లాంటి స్పెషలైజేషన్లలో ఇవి కోర్సులుగా ఉంటాయి. ఒకవేళ కోర్సులుగా అందుబాటులో లేనప్పటికీ మీరు సమ్మర్‌ ప్రాజెక్ట్‌, ఫైనల్‌ ప్రాజెక్ట్‌లను ఈ రంగాల్లో చేస్తే గత అనుభవం ఆధారంగా మెరుగైన ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌,  కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని