ఈ అర్హతతో పోటీపడొచ్చా?

నాగార్జున యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్‌ డిగ్రీ 2014-17లో చదివాను. ఈ యూనివర్సిటీ ఆంధ్రాకు చెందిందైనా స్టడీ సెంటర్‌ కోదాడ (తెలంగాణ)లోనే ఉండటంతో అక్కడే పూర్తిచేశాను.

Updated : 02 Nov 2022 06:04 IST

నాగార్జున యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్‌ డిగ్రీ 2014-17లో చదివాను. ఈ యూనివర్సిటీ ఆంధ్రాకు చెందిందైనా స్టడీ సెంటర్‌ కోదాడ (తెలంగాణ)లోనే ఉండటంతో అక్కడే పూర్తిచేశాను. ఈ డిగ్రీతో టీఎస్‌పీఎస్సీ పోటీ పరీక్షలు రాసుకోవచ్చా?

- కె. వంశీరెడ్డి  

సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ నియామక ప్రకటనల్లో యూజీసీ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి విద్యార్హతలు ఉండాలని అడుగుతారు. మీరు ఏపీకి సంబంధించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తెలంగాణలో ఉన్న కోదాడ స్టడీ సెంటర్‌లో డిగ్రీ చేశానని చెప్పారు. ఏ యూనివర్సిటీ అయినా యూజీసీ నియమనిబంధనల ప్రకారం స్టడీ సెంటర్‌ల ద్వారా డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందించడానికి కావాల్సిన అనుమతులు పొందివుంటే, ఆ డిగ్రీలు ఏ ఉద్యోగానికి అయినా చెల్లుబాటు అవుతాయి. మీరు తెలంగాణా రాష్ట్రానికి లోకల్‌ అయితే, తెలంగాణలో 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ఒకవేళ మీరు తెలంగాణ రాష్ట్రానికి నాన్‌ లోకల్‌ అయితే 5 శాతం ఓపెన్‌ కోటా కోసం పోటీపడాలి.  ఓపెన్‌ కోటాకు లోకల్‌, నాన్‌ లోకల్‌ అభ్యర్థులు అందరూ అర్హులే! టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాలతో పాటు, డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ లోకల్‌/ ఓపెన్‌ కోటాలో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.    

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని