అమ్మాయిలకు అనుకూలమేనా?
‘అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్’ ఉద్యోగానికి నా స్నేహితులు చాలామంది సన్నద్ధం అవుతున్నారు. దీనికి ఎంపికైతే ఉద్యోగ విధులు అమ్మాయిలకు అనుకూలంగా ఉంటాయా?
- బి.పార్థసారథి
అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగం అడవులను పరిరక్షించడానికి అవసరమైన ఒక పరిపాలనా ఉద్యోగం. దీనికి అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా అర్హులే. ఈ ఉద్యోగంలో అమ్మాయిలు మాత్రమే ఎదుర్కొనే ప్రత్యేకమైన సవాళ్లేమీ లేవు. ఫీల్డ్ వర్క్‌తోపాటు పరిపాలనా సంబంధిత బాధ్యతలనూ నిర్వహించవలసి ఉంటుంది. అటవీ పరిరక్షణ, ఆధునిక టెక్నాలజీని వాడటం, అపాయాలను ముందే పసిగట్టడం, ఉద్యోగుల పర్యవేక్షణ, అటవీ ప్రమాదాలను అంచనా వేయడం లాంటి బాధ్యతలు ఉంటాయి. ఈ ఉద్యోగానికి ఏం అవసరమంటే.. శారీరక దృఢత్వం, కమ్యూనికేషన్ స్కిల్స్, నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం, శ్రద్ధగా వినగలగటం, విశ్లేషణాత్మక శక్తి, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోగల సామర్థ్యం, నిర్వహణ నైపుణ్యాలు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో అమ్మాయిలు చేయలేని, చేయకూడని ఉద్యోగాలంటూ ఏమీ లేవు. అడవులను పరిరక్షిస్తూ, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలన్న ఆసక్తి ఉంటే, అమ్మాయిలు కూడా నిరభ్యంతరంగా ఈ ఉద్యోగానికి సన్నద్ధం కావొచ్చు.
- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!
-
World News
Rishi Sunak: సునాక్ మీరు బిలియనీరా..? బ్రిటన్ ప్రధాని సమాధానమిదే..