ఇంగ్లిష్‌లో స్కోరుకు..

ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి పరీక్షకు (ఇంగ్లిష్‌ మీడియం) సన్నద్ధమయ్యాను. ఇతర పోటీ పరీక్షల జనరల్‌ ఇంగ్లిష్‌ను ఎలా సాధన చేయాలి? చదవాల్సిన పుస్తకాలను తెలుపగలరు.

Published : 08 Nov 2022 00:25 IST

*ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి పరీక్షకు (ఇంగ్లిష్‌ మీడియం) సన్నద్ధమయ్యాను. ఇతర పోటీ పరీక్షల జనరల్‌ ఇంగ్లిష్‌ను ఎలా సాధన చేయాలి? చదవాల్సిన పుస్తకాలను తెలుపగలరు.
 

- ఎస్‌.సురేష్‌

* పోటీ పరీక్షల్లో జనరల్‌ ఇంగ్లిష్‌ సబ్జెక్టులో మెరుగైన స్కోరు సాధించాలంటే ముందునుంచే ప్రణాళికాబద్ధంగా సిద్దం కావాలి. ఇంగ్లిష్‌ కూడా మిగతా సబ్జెక్టుల్లాగే కొన్ని సూత్రాలు, నియమాలపై ఆధారపడి ఉంటుంది. ఆ నియమాలనూ, గ్రామర్‌నూ బాగా నేర్చుకొన్నట్లయితే పోటీ పరీక్షలో రాణించడం కష్టమేమీ కాదు. గ్రామర్‌ తోపాటు ఇంగ్లిష్‌లో పర్యాయ పదాలూ, వ్యతిరేక పదాలను కూడా బాగా నేర్చుకోండి. ఆంగ్ల వార్తా పత్రికలను క్రమం తప్పకుండా చదువుతూ టీవీలో, రేడియోలో ఇంగ్లిషు వార్తలను కూడా వినండి. వీటన్నింటితోపాటు ఆబ్జెక్టివ్‌ జనరల్‌ ఇంగ్లిష్‌ (ఎస్‌పీ భక్షి), ఇంగ్లిష్‌ గ్రామర్‌ అండ్‌ కంపోజిషన్‌ (ఎస్‌సీ గుప్త), ఆబ్జెక్టివ్‌ ఇంగ్లిష్‌ ఫర్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌ (హరిమోహన్‌ ప్రసాద్‌ అండ్‌ ఉమా సిన్హా), జనరల్‌ ఇంగ్లిష్‌ ఫర్‌ ఆల్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌  (దిశ ఎక్స్‌పర్ట్స్‌) లాంటి పుస్తకాలను చదివి, బాగా సాధన చేయండి. వీలున్నన్ని మాక్‌ టెస్ట్‌లు రాసి పోటీ పరీక్షల్లో మెరుగైన స్కోరు సాధించండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని