స్టాటిస్టిక్స్‌లో పీజీ చేయాలంటే?

ఎమ్మెస్సీ (మ్యాథ్స్‌) చేసి టీచర్‌గా పనిచేస్తున్నాను. స్టాటిస్టిక్స్‌లో పీజీ చేయాలని ఉంది. ప్రైవేటుగా ఎమ్మెస్సీ (స్టాటిస్టిక్స్‌) చేయడానికి అవకాశం

Updated : 09 Nov 2022 04:45 IST

ఎమ్మెస్సీ (మ్యాథ్స్‌) చేసి టీచర్‌గా పనిచేస్తున్నాను. స్టాటిస్టిక్స్‌లో పీజీ చేయాలని ఉంది. ప్రైవేటుగా ఎమ్మెస్సీ (స్టాటిస్టిక్స్‌) చేయడానికి అవకాశం ఉందా?

-బీవీడీ రమణమూర్తి,  విశాఖపట్నం

ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ కోర్సుని డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విధానంలో అతితక్కువ యూనివర్సిటీలు మాత్రమే అందిస్తున్నాయి. సాధారణంగా ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ చేయాలంటే, డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ చదివి ఉండాలన్న నిబంధన అమల్లో ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్‌ విభాగంలో మాత్రం ఎంఎస్సీ స్టాటిస్టిక్స్‌ చేయాలంటే డిగ్రీలో మ్యాథ్స్‌/ స్టాటిస్టిక్స్‌ చదివి ఉండాలి. కాబట్టి, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొ. జి. రాంరెడ్డి డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ నుంచి ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ కోర్సుని ప్రైవేటుగా చేయొచ్చు. భవిష్యత్తులో నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-2020 పూర్తి స్థాయిలోకి అమల్లోకి వచ్చాక మరిన్ని యూనివర్సిటీలు  యూజీ/పీజీ కోర్సుల ప్రవేశాలకు విద్యార్హతలను  మరింతగా సడలించే అవకాశం ఉంది.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని