సర్కారీ కొలువుకు అవరోధమా?

ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సు (ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్‌) పూర్తిచేశాను. అదే కాలేజీలో బీఏ డిగ్రీ కూడా చదివాను. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పరీక్షలు రాస్తున్నాను.

Published : 10 Nov 2022 00:02 IST

ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సు (ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్‌) పూర్తిచేశాను. అదే కాలేజీలో బీఏ డిగ్రీ కూడా చదివాను. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పరీక్షలు రాస్తున్నాను. ఇంటర్‌ ఒకేషనల్‌గా చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా?

- ఎం.ఆర్‌.జి.కుమార్‌

మీరు ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సు చేశాక, బీఏ డిగ్రీ కూడా చేశారు కాబట్టి, డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ మీరు అర్హులే. ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్‌లో ‘ఇంటర్‌ వొకేషనల్‌ చేసినవారు అర్హులు కాదు’ అని చెప్పనంతవరకు మీరు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలనూ నిశ్చింతగా రాయవచ్చు. ఇటీవల జారీ అయిన ఏ ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలోనూ ఆ విధంగా పేర్కొనలేదు. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు