Published : 16 Nov 2022 00:14 IST

కెనడాలో డెంటిస్టుగా ప్రాక్టీస్‌ చేయాలంటే?

* బీడీఎస్‌ చదివాను. ఈ కోర్సు చేసినవారికి కెనడాలో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? అక్కడ ఉద్యోగం సంపాదించాలంటే ప్రవేశ పరీక్షలు ఏమైనా రాయాలా?

- ఉదయ్‌

* బీడీఎస్‌ చదివినవారికి కెనడాలో ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే, అక్కడకి వెళ్లి ఉద్యోగం/ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాలంటే వివిధ రెగ్యులేటరీ సంస్థల అనుమతులు అవసరం. ముందుగా మీ బీడీఎస్‌ డిగ్రీ, కెనడా డెంటల్‌ డిగ్రీకి సమానమని నిర్ధరించడానికి నేషనల్‌ డెంటల్‌ ఎగ్జామినింగ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కెనడా (ఎన్‌డీఈబీ)కి దరఖాస్తు చేసుకోవాలి. మీ డిగ్రీ నిర్ధÄరణ పూర్తయ్యాక ఆబ్జెక్టివ్‌ స్ట్రక్చర్డ్‌ క్లినికల్‌ ఎగ్జామినేషన్‌ (ఓఎస్‌సీఈ) రాయాలి. దీనిలో ముఖ్యంగా ప్రాథమిక పరిజ్ఞానం,  క్లినికల్‌ నాలెడ్జ్‌లను పరీక్షిస్తారు. సాధారణంగా క్లినికల్‌ జడ్జ్‌మెంట్‌, డయాగ్నోసిస్‌, ట్రీట్‌మెంట్‌ ప్లానింగ్‌, ప్రోగ్నసిస్‌, ట్రీట్‌మెంట్‌ మెథడ్స్‌, క్లినికల్‌ డెసిషన్‌ మేకింగ్‌లపై ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో కనీసం 75 స్కేల్డ్‌ స్కోర్‌ పొందితేనే ఉత్తీర్ణత సాధించినట్లుగా పరిగణిస్తారు. ఒకవేళ విజయవంతం కాలేకపోతే మరో రెండు సార్లు ఈ పరీక్షలు రాసే వీలుంటుంది. పైన చెప్పిన ప్రక్రియలన్నీ పూర్తయ్యాకే నేషనల్‌ డెంటల్‌ ఎగ్జామినింగ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కెనడా సంస్థ ఆ దేశంలో డెంటిస్ట్‌గా ప్రాక్టీస్‌ చేయడానికి అనుమతి పత్రం జారీ చేస్తుంది. కెనడాలో డెంటిస్ట్రీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసి ఆ తరువాత ఉద్యోగ/ ప్రాక్టీస్‌ ప్రయత్నాలు చేయొచ్చు. ఇతర దేశాల్లో బీడీఎస్‌ చేసిన తరువాత కెనడాలో నాలుగు సంవత్సరాల ఇంటర్నేషనల్‌ డెంటిస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ ప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో మూడో సంవత్సరంలో చేరి డెంటిస్టుగా కెరియర్‌ను మొదలు పెట్టే అవకాశం ఉంది.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు