Updated : 17 Nov 2022 10:14 IST

Job Security: మీ ఉద్యోగం భద్రమేనా!

తెలుసుకోండిలా...  

అన్ని సంస్థలూ ఉద్యోగుల పనితీరునే ప్రామాణికంగా భావిస్తాయి. పదోన్నతి, వేతనం పెంపు, కొత్త బాధ్యతలు అప్పగించడం... ఇలా దేనికైనా.. పని, నడవడికే ప్రమాణాలు. కొన్ని ప్రశ్నలకు నిజాయతీగా సమాధానమిచ్చి, స్కోరు చూసుకుంటే.. సంస్థ దృష్టిలో మీరెలాంటి ఉద్యోగులో తెలుసుకోవచ్చు. మార్పులకు సిద్ధమైతే సంస్థకు విలువైన ఆస్తిగానూ మారవచ్చు.

1. మీరు చేస్తున్న పనికి సంబంధించి ఎందులోనైనా మీకే ప్రత్యేకమైన, తిరుగులేని స్కిల్స్‌ ఏమైనా ఉన్నాయా?
ఎ. అవును, నేను మాత్రమే ఆ పనిని చేయగలను
బి. అవును, అయితే నేనొక్కడినే కాకుండా మరికొంత మంది ఉన్నారు. సి. కాదు, ఎక్స్‌పర్ట్‌ కావడానికి ప్రయత్నిస్తాను.
డి. అటువంటి ప్రత్యేకతలు నాకు సాధ్యం కాదు.
2. మీ జూనియర్‌లకు మెంటర్‌గా ఉంటున్నారా?
ఎ. అవును, ఎల్లప్పుడూ వారికి మార్గనిర్దేశం చేస్తున్నాను.
బి. అవును, అప్పుడప్పుడూ మార్గనిర్దేశం చేస్తున్నాను.
సి. కాదు, కానీ ప్రయత్నిస్తాను.
డి. నాతో సాధ్యమయ్యే పనికాదు.
3. ఏదైనా పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారా?
ఎ. అవును, చాలాసార్లు బాధ్యతలు తీసుకున్నాను.
బి. అవును, అప్పుడప్పుడు పనిభారం తీసుకున్నాను.
సి. ఇప్పటివరకు తీసుకోలేదు, ప్రయత్నిస్తాను.
డి. నాకంత టైమ్‌ లేదు.
4. మీరు చేస్తున్న పనిలో వచ్చిన సమస్యలకు ఎప్పుడైనా పరిష్కారం చూపారా?
ఎ. అవును, చాలాసార్లు   బి. అవును, అప్పుడప్పుడు
సి. నన్నెవరూ అడగలేదు   డి. అది నా బాధ్యత కాదు
5. కొత్తగా ఏదైనా స్కిల్‌/ టెక్నాలజీ నేర్చుకున్నారా?
ఎ. నేనెప్పుడూ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటూ ఉంటాను.
బి. అవును, కానీ ఈ మధ్యమాత్రం నేర్చుకోలేదు.
సి. కాదు, కానీ నేర్చుకోడానికి ప్రయత్నిస్తాను.
డి. అలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు.
6. మీ బాస్‌ పనిభారాన్ని మీరెప్పుడైనా పంచుకున్నారా?
ఎ. అవును, చాలాసార్లు.   బి. అవును, అప్పుడప్పుడు.
సి. కాదు, చాలా అరుదుగా.
డి. లేదు, ఇంతవరకు అలాంటి ప్రయత్నం చేయలేదు.
7. ఆఫీసు రాజకీయాల్లో మీరు తలదూర్చుతారా?
ఎ. నేను అలాంటివాటికి చాలా దూరంగా ఉంటాను.
బి. అప్పుడప్పుడు.
సి. వాటిలో భాగంగా ఉంటాను. ప్రత్యక్షంగా కలుగజేసుకోను.
డి. అవును, వాటిని నేను బాగా ఆస్వాదిస్తాను.
8. మీరు చేస్తున్న పనిపై అభిప్రాయాలు పంచుకుంటారా?
ఎ. అవును, ప్రతిసారీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాను.
బి. అవును, కానీ అప్పుడప్పుడే నా అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తాను.
సి. చాలా సందర్భాల్లో నా అభిప్రాయాన్ని చెప్పలేకపోయాను.
డి. ఇంతవరకు ఎలాంటి అభిప్రాయాన్నీ వ్యక్తం చేయలేదు.
9. మీ సహోద్యోగులతో సత్సంబంధాలు ఉన్నాయా?
ఎ. అందరితోనూ కలివిడిగా, స్నేహపూర్వకంగా ఉంటాను.
బి. కొంచెం కలివిడిగా ఉంటాను.
సి. ఏదైనా సమస్య ఉంటేనే మాట్లాడతాను.
డి. సహోద్యోగులతో నాకున్నవి సాధారణ పరిచయాలే.


మీ స్కోరు ఎంతంటే..

ఎ గా గుర్తించిన ప్రతి సమాధానానికీ 3 మార్కులు, బి మీ జవాబు అయితే 2, సి ని ఎంచుకుంటే 1, డి మీ ఎంపిక అయితే 0 మార్కులు వేసుకోండి. ఇప్పుడు మీకు వచ్చిన మొత్తం మార్కులెన్నో చూసుకోండి.
24, ఆపైన పాయింట్లు వస్తే...
మీ సంస్థ దృష్టిలో మీరెంతో ముఖ్యమైన వ్యక్తి. మిమ్మల్ని సంస్థ ఒక ఆస్తిగా పరిగణిస్తుంది. ఇదే తరహా పనితీరును కొనసాగిస్తే ఎంతో విలువైన భవిష్యత్తు మీ సొంతమవుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దురహంకారానికి చోటివ్వకండి.
18 నుంచి 23 వరకు...
సంస్థ మిమ్మల్ని విలువైనవారిగా పరిగణిస్తుంది. అయితే మీరు ఈ స్థాయి నుంచి ముఖ్యమైన వ్యక్తిగా మారటానికి ప్రయత్నించాలి. మీరుచేసే ప్రయత్నం మిమ్మల్ని భద్రమైన కెరియర్‌ వైపు తీసుకెళ్తుంది.
12 నుంచి 17 పాయింట్లు..
మీ పెర్ఫార్మెన్స్‌ మధ్యస్థంగా ఉన్నట్లు లెక్క. కంపెనీ మిమ్మల్ని విలువైన మానవవనరుగా పరిగణించడం లేదు. తక్షణం మీ ప్రవర్తన, పనితీరులో మార్పు రావాలి. అలా జరిగితేనే మీ భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదు.
12 లోపు..
సంస్థ మిమ్మల్ని భరిస్తున్నట్లు లెక్క. అలాగే మిమ్మల్ని ఎప్పుడు, ఎలా వదిలించుకుందామా అని ఎదురుచూస్తుంది. సరైన సందర్భం వచ్చినప్పుడు వేటు ఖాయం. అయితే మీ పనితీరు మెరుగై, ఆలోచనల్లో మార్పువచ్చి, చొరవ తీసుకుని, బృందంలో మమేకమై, బాధ్యతగా ఉంటే మీ ఉద్యోగం భద్రమే. ఇందుకోసం ఎంతో తీవ్రంగా శ్రమించడం తప్పనిసరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు