Published : 17 Nov 2022 00:28 IST

రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు ఎక్కడుంది?

ఇంటర్‌ (హెచ్‌ఈసీ) చదివాను. రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేయాలనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సు ఎక్కడ అందుబాటులో ఉంది?

- రిషి

- రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ అనేది ఒక ప్రత్యేకమైన కోర్సు. దీన్ని డిగ్రీ స్థాయిలో కాకుండా పీజీ స్థాయిలో కానీ, డిగ్రీ తరువాత సర్టిఫికెట్‌ / డిప్లొమా/ పీజీ డిప్లొమాగా గానీ చేస్తే ఉపయోగకరం. ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ లాంటి రంగాల్లో కొంతకాలం పనిచేసిన తరువాత రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేయడం శ్రేయస్కరం. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ కోర్సు తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ స్థాయిలో లేదు. ఇతర రాష్ట్రాల్లోని అతికొద్ది ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును డిగ్రీ స్థాయిలో అందిస్తున్నాయి. మీరు డిగ్రీలో బీబీఏ (బ్యాంకింగ్‌/ ఇన్సూరెన్స్‌/ ఫైనాన్స్‌) లేదా బీకాం చదివి, కొంత ఉద్యోగానుభవం సంపాదించాక ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఆర్‌ఎం), హైదరాబాద్‌లో పీజీ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వండి. రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో శిక్షణ పొందినవారికి మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు