ఎనస్తీషియాలో డిగ్రీ చేశాక?

బీఎస్సీ ఎనస్తీషియా చివరి ఏడాది చదువుతున్నాను. ఈ కోర్సుకు దేశ విదేశాల్లో ఏ ఉన్నత విద్యావకాశాలుంటాయి?

Updated : 28 Nov 2022 04:59 IST

బీఎస్సీ ఎనస్తీషియా చివరి ఏడాది చదువుతున్నాను. ఈ కోర్సుకు దేశ విదేశాల్లో ఏ ఉన్నత విద్యావకాశాలుంటాయి?

 వి.పవన్‌

* బీఎస్సీ ఎనస్తీషియా చదివాక ఎంఎస్సీ ఎనస్తీషియా కానీ, ఎనస్తీషియాలో అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులు కానీ చేసే అవకాశం ఉంది. మీరు ఉన్నతవిద్యను విదేశాల్లో చేయాలనుకొంటే కనీసం రెండు సంవత్సరాల ఉద్యోగానుభవం పొందాకే, ఆ ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఎనస్తీషియా లాంటి ప్రొఫెషనల్‌ రంగాల్లో నైపుణ్యాలు చాలా అవసరం. వీటిని కోర్సు చదివే సమయంలో కంటే ఉద్యోగంలోనే ఎక్కువగా నేర్చుకొనే అవకాశం ఉంది. ఎనస్తీషియాలో పీజీ కోర్సులు యూకే, అమెరికా, కెనడా లాంటి దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా కార్డిఫ్‌ యూనివర్సిటీ, ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ గాల్వే, ది కాలేజ్‌ ఆఫ్‌ అనస్తీయాలజిస్ట్స్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌, బ్రైటన్‌ అండ్‌ ససెక్స్‌ మెడికల్‌ స్కూల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌ హామ్‌,  యూనివర్సిటీ ఆఫ్‌ ఆల్బెట్రా, యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ లా క్రోసెల్లో ఎనస్తీషియా కోర్సులున్నాయి. ఈ కోర్సు చేసినవారికి దేశ విదేశాల్లో మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని