పీఈటీ అవ్వాలంటే?

డిగ్రీ పాసయ్యాను. స్కూలు, కాలేజీలో స్పోర్ట్స్‌ ఛాంపియన్‌ను. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ)గా స్థిరపడాలనుంది.

Updated : 01 Dec 2022 06:43 IST

డిగ్రీ పాసయ్యాను. స్కూలు, కాలేజీలో స్పోర్ట్స్‌ ఛాంపియన్‌ను. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ)గా స్థిరపడాలనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సు ఎక్కడుంది?

ఎన్‌.అభిషేక్‌

తెలంగాణలో గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, దోమల్‌గూడ, హైదరాబాద్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఎస్‌ఆర్‌ గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, గోపన్నపాలెం, ఏలూరులో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఈడీ) కోర్సు చాలా కాలంగా అందుబాటులో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రైవేటు కళాశాల అయిన రాయలసీమ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, పొద్దుటూరు కూడా మూడు దశాబ్దాలుగా ఈ కోర్సును అందిస్తోంది. ఇవే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న చాలా ప్రైవేటు కళాశాలలు బీపీఈడీని అందిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు విడివిడిగా నిర్వహించే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీఈసీఈటీ) రాసి ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌ ద్వారా నచ్చిన కళాశాలలో ప్రవేశం  పొందండి. బీపీఈడీ కోర్సును అందిస్తున్న కళాశాలల వివరాలకోసం వివిధ యూనివర్సిటీల వెబ్‌సైట్‌లు చూడండి. కోర్సుకు సంబంధించిన ప్రభుత్వ గుర్తింపు వివరాలను నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) వెబ్‌సైట్‌లో పొందండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని