వెటర్నరీ సైన్స్‌ ఎక్కడ మేలు?

మా అబ్బాయి బైపీసీ చదువుతున్నాడు. వెటర్నరీ సైన్స్‌/ యానిమల్‌ హజ్బెండరీ కోర్సు చేయాలనుకుంటున్నాడు.

Updated : 06 Dec 2022 02:51 IST

మా అబ్బాయి బైపీసీ చదువుతున్నాడు. వెటర్నరీ సైన్స్‌/ యానిమల్‌ హజ్బెండరీ కోర్సు చేయాలనుకుంటున్నాడు. ఏ విదేశీ యూనివర్సిటీలో ఈ డిగ్రీ ఉంది?

ఉమ

* బైపీసీ తరువాత వెటర్నరీ సైన్స్‌/ యానిమల్‌ హజ్బెండరీ కోర్సును మనదేశంలో చేయడమే శ్రేయస్కరం. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌/ సూపర్‌ స్పెషలైజేషన్‌ కోసం విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు. మీకు డిగ్రీ కోర్సే విదేశాల్లో చదివించాలనే ఆసక్తి ఉంటే యూకే, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల్లో అందుబాటులో ఉంది. యూకే విషయానికొస్తే యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బరో, యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ నాటింగ్‌ హామ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్గో, యూనివర్సిటీ ఆఫ్‌ లివర్‌ పూల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ సర్రే, రాయల్‌ వెటర్నరీ కాలేజ్‌లు ఈ కోర్సును అందిస్తున్నాయి. వెటర్నరీ సైన్స్‌ కోర్సు కెనడాలో వెస్టర్న్‌ కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ మెడిసిన్‌, ఓంటారియో వెటర్నరీ కాలేజ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కాల్గేరి, యూనివర్సిటీ ఆఫ్‌ మాంట్రియాల్‌లో కూడా ఉంది. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌, యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్‌లాండ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ అడిలైడ్‌, లా ట్రోబే యూనివర్సిటీ, ఫెడరేషన్‌ యూనివర్సిటీలు కూడా వెటర్నరీ సైన్స్‌ను అందిస్తున్నాయి. అమెరికా విషయానికొస్తే- పర్డ్యూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఆరిజోనా, కెంట్‌ స్టేట్‌ యూనివర్సిటీ, ఎంఐటీ, ముర్రే స్టేట్‌ యూనివర్సిటీ తదితర సంస్థల్లో ఈ కోర్సు లభ్యమవుతోంది. మీరు ఏదేశంలో, ఏయే యూనివర్సిటీల్లో చదవాలనుకొంటున్నారో నిర్ణయించుకొని, సంబంధిత ప్రవేశ పద్ధతుల గురించి అవగాహన ఏర్పర్చుకొని ముందుకెళ్లండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని