యూఎస్‌లో పీజీ చేస్తే?

యూఎస్‌లోని ఏయే యూనివర్సిటీలు బయొలాజికల్‌ సైన్స్‌లో పీజీ అందిస్తున్నాయి? దీంతో దేశ విదేశాల్లో ఉండే ఉద్యోగావకాశాల గురించి తెలుపగలరు.

Updated : 12 Dec 2022 06:21 IST

యూఎస్‌లోని ఏయే యూనివర్సిటీలు బయొలాజికల్‌ సైన్స్‌లో పీజీ అందిస్తున్నాయి? దీంతో దేశ విదేశాల్లో ఉండే ఉద్యోగావకాశాల గురించి తెలుపగలరు.

వికాస్‌

* యూఎస్‌లో చాలా యూనివర్సిటీలు బయొలాజికల్‌ సైన్స్‌లో పీజీ కోర్సును అందిస్తున్నాయి. వాటిలో హార్వర్డ్‌ యూనివర్సిటీ, ఎంఐటీ,  స్టాన్‌ఫర్డ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో, రొచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ శాన్‌ఫ్రాన్సిస్కో, టెక్సాస్‌ ఎ అండ్‌ ఎం యూనివర్సిటీ, నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీ, వొహాయో యూనివర్సిటీ ముఖ్యమైనవి. మీరు యూఎస్‌లో ఎంఎస్‌ చేస్తే, అక్కడే ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయొచ్చు. ఆసక్తి, అవకాశం ఉంటే అక్కడే పీహెచ్‌డీ కూడా చేస్తే మెరుగైన ఉద్యోగాలుంటాయి. సాధారణంగా బయొలాజికల్‌ సైన్స్‌లో పీజీ చేసినవారికి ఫార్మా, బయోటెక్‌, బయో మెడికల్‌, ఎనర్జీ కంపెనీల్లో, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, క్లినికల్‌ రిసెర్చ్‌, ఫర్టిలైజర్‌, పెస్టిసైడ్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇవేకాకుండా బోధన, పరిశోధన సంస్థల్లో కూడా ఉద్యోగం చేసే అవకాశం ఉంది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని