ఆస్ట్రేలియాలో పనిచేయాలంటే...
ఫార్మసీలో మాస్టర్స్ చేశాను క్లినికల్ రిసెర్చ్ ఫీల్డ్‌లో ఏడేళ్ల అనుభవం ఉంది. ఇదే రంగంలో ఆస్ట్రేలియాలో పనిచేయాలంటే అదనంగా డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సులు చేయాలా?
ఫార్మసీలో మాస్టర్స్ చేశాను క్లినికల్ రిసెర్చ్ ఫీల్డ్‌లో ఏడేళ్ల అనుభవం ఉంది. ఇదే రంగంలో ఆస్ట్రేలియాలో పనిచేయాలంటే అదనంగా డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సులు చేయాలా?
- పి.రవితేజ
సాధారణంగా మనదేశ ఉద్యోగానుభవంతో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో నేరుగా ఉద్యోగం పొందటం కొంత కష్టమే. మీరు ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్, మోనాశ్ యూనివర్సిటీ లాంటి ప్రముఖ యూనివర్సిటీల్లో ఏదో ఒకదానిలో క్లినికల్ రిసెర్చ్‌లో మరొక పీజీ చేస్తే మీ ఏడేళ్ల పని అనుభవంతో మెరుగైన ఉద్యోగం పొందవచ్చు. అలాకాకుండా కోర్స్‌ఎరా, యుడెమి, ఎడెక్స్ లాంటి ఆన్‌లైన్ వేదికల్లోనో, ప్రముఖ యూనివర్సిటీలు అందించే క్లినికల్ రిసెర్చ్ సంబంధిత కోర్సులనో చేసే ప్రయత్నం చేయండి. ఆ తరువాత మీరు ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థ ద్వారా అమెరికా/కెనడా/ ఆస్ట్రేలియా దేశాల్లో ఉన్న ప్రముఖ క్లినికల్ రిసెర్చ్ ల్యాబుల్లో ట్రైనీ/ అప్రెంటిస్‌గా చేరవచ్చు. కొంత విదేశీ ఉద్యోగానుభవం పొందాక ఆస్ట్రేలియాలో ఉద్యోగాలకోసం ప్రయత్నించండి.
- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు