గేమింగ్‌ నేర్చుకోవాలని..

గేమ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ డిజైన్‌ అనేది వినూత్నమైన ప్రత్యేక కోర్సు. ఇందులో వినోదం, విద్య, వ్యాయామం కోసం గేమ్‌లను డిజైన్‌ చేయడం, తయారుచేయడం నేర్చుకుంటారు.

Updated : 19 Dec 2022 05:39 IST

ఇంటర్‌ (సీఈసీ) చదువుతున్నాను. గేమ్‌    డెవలప్‌మెంట్‌ అండ్‌ డిజైన్‌లో డిగ్రీ చేయాలనుంది. కాలేజీల వివరాలు, ఉద్యోగ అవకాశాల గురించి తెలుపగలరు.

మోహిత్‌

గేమ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ డిజైన్‌ అనేది వినూత్నమైన ప్రత్యేక కోర్సు. ఇందులో వినోదం, విద్య, వ్యాయామం కోసం గేమ్‌లను డిజైన్‌ చేయడం, తయారుచేయడం నేర్చుకుంటారు. ల్యాప్‌టాప్‌లు, పర్సనల్‌ కంప్యూటర్లు, మొబైల్‌లు, టాబ్లెట్‌ల కోసం గేమ్‌లను రూపొందించడంలో ఆసక్తి ఉన్నవారికి అవసరమయ్యే డిజైన్‌ స్పెషలైజేషన్‌ ఇది. వీడియో గేమ్‌ డెవలప్‌మెంట్‌, డిజైన్‌ అంశాలు, ప్రోగ్రామింగ్‌ సూత్రాల గురించి శిక్షణ ఇస్తారు.పెరుగుతున్న ఆదాయ స్థాయులు, ఇంటర్నెట్‌ వ్యాప్తి వల్ల గేమింగ్‌ పరిశ్రమకు మనదేశం ఒక చిరునామాగా మారబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో  గేమ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ డిజైన్‌ కోర్సును కొన్ని విద్యాసంస్థలు డిగ్రీ కోర్సులుగా అందిస్తున్నాయి.

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైనార్ట్స్‌ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న మూడు కళాశాలల్లో సంబంధిత కోర్సులు ఉన్నాయి.

క్రియేటివ్‌ మల్టీమీడియా కాలేజ్‌ ఆఫ్‌ ఫైనార్ట్స్‌- బీఏ (ఆనర్స్‌) గేమ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ (4 ఏళ్లు)

బ్యాక్‌స్టేజ్‌ పాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గేమింగ్‌- బీఎస్సీ (ఆనర్స్‌) కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ గేమ్‌ డెవలప్‌మెంట్‌ (4 ఏళ్లు), బీఏ (ఆనర్స్‌) గేమ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ (4 ఏళ్లు)

ఐకాట్‌ కాలేజ్‌- బీఏ (ఆనర్స్‌) గేమ్‌ అండ్‌ డిజైన్‌ (4 ఏళ్లు), బీఎస్సీ (ఆనర్స్‌) కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ గేమ్‌ డెవలప్‌మెంట్‌ (4 ఏళ్లు)
గేమ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ డిజైన్‌ లాంటి కోర్సుల్లో డిగ్రీల కంటే, నైపుణ్యం ప్రధానం. ఈ కోర్సు చేసినవారికి గేమ్‌ డిజైనర్‌, గేమ్‌ డెవలపర్‌, గేమ్‌ రైటర్‌, గేమ్‌ యానిమేటర్‌, గ్రాఫిక్స్‌ సిములేటర్‌, గేమ్‌ టెస్టర్‌, గేమ్‌ ఆర్టిస్ట్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ హోదాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు